Diwali holiday in America : విదేశాల్లో ఘనంగా దీపావళి వేడుకలు- యూఎస్​లో అఫీషియల్​ హాలీడే కూడా!-diwali declared holiday in american states check out cities abroad to celebrate like india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Diwali Holiday In America : విదేశాల్లో ఘనంగా దీపావళి వేడుకలు- యూఎస్​లో అఫీషియల్​ హాలీడే కూడా!

Diwali holiday in America : విదేశాల్లో ఘనంగా దీపావళి వేడుకలు- యూఎస్​లో అఫీషియల్​ హాలీడే కూడా!

Sharath Chitturi HT Telugu

Diwali holiday in America : విదేశాల్లో ఘనంగా దీపావళి వేడుకలు జరగనున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలోని అనేక రాష్ట్రాలు దీపావళిని అఫీషియల్​గా గుర్తించాయి, హాలీడేను కూడా ఇచ్చాయి.

వైట్​హౌస్​లో దీపావళి వేడుకలు (ఫైల్​ ఫొటో)

భారతీయ పండగలు, ఉత్సవాలకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, కెనడాల్లోని అనేక నగరాల్లో భారత పండగలకు అధికారిక గుర్తింపు లభించడంతో పాటు అఫీషియల్​ హాలీడే కూడా ఉంటోంది. మరీ ముఖ్యంగా దీపావళిని ఘనంగా నిర్వహించేందుకు అమెరికాలోని అనేక రాష్ట్రాలు సన్నద్ధమవుతున్నాయి. ఫలితంగా భారత్​లోనే కాకుండా విదేశాల్లో కూడా దీపావళిని ఘనంగా జరుపుకోవడానికి అవకాశం దక్కింది.

ఇటీవల, పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో సంతకం చేసిన ద్వైపాక్షిక చట్టం తరువాత అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుదినంగా ప్రకటించింది. ఈ చట్టం వెంటనే అమల్లోకి కూడ వచ్చింది. హిందూ లూనిసోలార్ క్యాలెండర్​లో కార్తీక మాసం 15వ రోజున జరుపుకునే సెలవు దినంగా దీపావళిని ఈ చట్టం పేర్కొంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు జరిగే దీపావళి వేడుకలు ఈ కొత్త చట్టం ప్రకారం అధికారికంగా గుర్తించిన మొట్టమొదటి వేడుక అవుతుంది.

అయితే, ఈ చట్టం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యాపారాలను మూసివేయాల్సిన అవసరం లేదు. కానీ దీపావళి సాంస్కృతిక ప్రాముఖ్యతకు ఈ చట్టం ద్వారా అమెరికాలో బలమైన గుర్తింపు లభిచింది.

వీదేశాల్లో దీపావళి వేడుకలు ఇలా..

యునైటెడ్ స్టేట్స్..

యునైటెడ్ స్టేట్స్​లో, అనేక రాష్ట్రాలు దీపావళిని అధికారిక సెలవు దినంగా గుర్తించాయి. న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ 2023లో న్యూయార్క్ నగర ప్రభుత్వ పాఠశాలలకు దీపావళిని పాఠశాల సెలవు దినంగా ప్రకటించే చట్టంపై సంతకం చేశారు. ప్రతి సంవత్సరం భారతీయ క్యాలెండర్ ఎనిమిదొవ నెల 15వ రోజున, న్యూయార్క్ నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని ఈ కీలకమైన చట్టం నిర్దేశిస్తుంది.

న్యూజెర్సీ..

ఇంకా అధికారిక దీపావళి సెలవు చట్టాన్ని ఆమోదించనప్పటికీ, అనేక పాఠశాలలు విద్యార్థులకు ఒక రోజు సెలవు ఇవ్వడం ద్వారా ఈ హిందూ పండుగ ప్రాముఖ్యతను గుర్తించడంలో న్యూజెర్సీ చురుకుగా ఉంది. ముఖ్యంగా, 2023 నాటికి, రాష్ట్రంలో 4.6% నివాసితులు భారత సంతతికి చెందినవారుగా ఉండటంతో ఈ చర్యలకు మద్దతు లభించింది.

పెన్సిల్వేనియా..

అమెరికాలో దీపావళి పండుగను పబ్లిక్ హాలీడే హోదాతో అధికారికంగా జరుపుకున్న తొలి రాష్ట్రంగా పెన్సిల్వేనియా నిలిచింది. గవర్నర్ జోష్ షాపిరో ఇటీవల సంతకం చేయడం చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు.

యునైటెడ్ కింగ్​డమ్..

యునైటెడ్ కింగ్​డమ్​లో దీపావళిని అధికారిక సెలవుదినంగా పేర్కొననప్పటికీ, గణనీయమైన భారతీయ జనాభా కారణంగా ఈ పండుగను అనేక నగరాల్లో సంతోషంగా జరుపుకుంటారు.

భారతదేశంలో మాదిరిగానే దీపావళిని ఉత్సాహంగా, స్ఫూర్తితో జరుపుకునే యుకె నగరాల జాబితా ఇక్కడ ఉంది.

-లీసెస్టర్

-బెల్​ఫాస్ట్

-లండన్

-ఎడిన్​బర్గ్

-బర్మింగ్ హామ్

కెనడా..

కెనడాలో దీపావళి పబ్లిక్ హాలిడే కాదు. కానీ ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా గుర్తించడం జరిగింది. చాలా పాఠశాలలు, పని ప్రదేశాలు ఈ సందర్భాన్ని గుర్తుగా ఆచారాలకు చోటు కల్పిస్తాయి లేదా కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.