SC judge who opposed demonetisation:‘నోట్ల రద్దు’ను తప్పుబట్టిన ఏకైక న్యాయమూర్తి-dissenting sc judge says demonetisation decision was exercise of power contrary to law ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Dissenting Sc Judge Says Demonetisation Decision Was Exercise Of Power 'Contrary To Law'

SC judge who opposed demonetisation:‘నోట్ల రద్దు’ను తప్పుబట్టిన ఏకైక న్యాయమూర్తి

Sudarshan Vaddanam HT Telugu
Jan 04, 2023 12:38 AM IST

SC judge who opposed demonetisation: సహచర న్యాయమూర్తులు సమర్దించినప్పటికీ.. నోట్ల రద్దు నిర్ణయం తప్పు అని భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న. నోట్ల రద్దు అమలు చట్ట ప్రకారం జరగలేదని ఆమె విస్పష్టంగా తన తీర్పులో ప్రకటించారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న

SC judge who opposed demonetisation: రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు నోట్ల రద్దు (note ban) నిర్ణయాన్ని సమర్దించారు. ఒక్కరు మాత్రం వ్యతిరేకించారు. నోట్ల రద్దు నిర్ణయం, అమలు.. రెండూ చట్ట ప్రకారం జరగలేదని తేల్చి చెప్పారు. ఆ న్యాయమూర్తే జస్టిస్ బీవీ నాగరత్న (Justice BV Nagarathna). 4-1 మెజారిటీతో నోట్ల రద్దు(demonetisation) నిర్ణయం సరైనదేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

SC judge who opposed demonetisation: ఉద్దేశం మంచిదే కావచ్చు..

నోట్ల రద్దు (demonetisation) నిర్ణయాన్ని తప్పుబడుతూ 124 పేజీల తీర్పును జస్టిస్ బీవీ నాగరత్న(Justice BV Nagarathna) వెలువరించారు. అందులో కొన్ని కీలక అంశాలను ఆమె స్పృశించారు. నోట్ల రద్దు నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ, ఆ నిర్ణయాన్ని అమలు చేసిన తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఆమె (Justice BV Nagarathna) స్పష్టం చేశారు. ‘‘నల్లధనం నుంచి సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకునే సదుద్దేశంతోనే నోట్ల రద్దు(demonetisation) నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. కానీ, ఆ నిర్ణయాన్ని కేంద్రం అమలు చేసిన తీరు చట్టవిరుద్ధంగా ఉంది’’ అని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) తేల్చి చెప్పారు.

SC judge who opposed demonetisation: పార్లమెంటు పాత్ర..

నోట్ల రద్దు (demonetisation) నిర్ణయంలో పార్లమెంటుకు కూడా భాగస్వామ్యం కల్పించి ఉండే బావుండేదని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) అభిప్రాయపడ్డారు. ‘‘పార్లమెంట్లో లోతైన, అర్థవంతమైన చర్చ అనంతరమే ప్రభుత్వం చట్టాలు చేయాలి. అలాగే, సున్నితమైన, కీలకమైన నోట్ల రద్దు (demonetisation) వంటి నిర్ణయాన్ని కూడా పార్లమెంట్లో చర్చ జరిపి తీసుకోవాలి. రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు సామాన్యమైన నిర్ణయం కాదు. చెలామణిలో ఉన్న కరెన్సీలో 86% కరెన్సీని రద్దు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయం. అలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని కేవలం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా తీసుకోవడం సరికాదు. పార్లమెంట్లో ఈ అంశాన్ని చర్చకు పెట్టి, లోతైన, అర్థవంతమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకుని ఉంటే ఆ నిర్ణయానికి చట్టబద్ధత లభించేది’’ అని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) పేర్కొన్నారు. ‘నోట్ల రద్దు (demonetisation) నిర్ణయాన్ని తీసుకునే అధికారం కేంద్రానికి ఉండొచ్చు, కానీ ఈ ప్రక్రియలో ప్రజాస్వామ్యానికి మూల స్థంభమైన పార్లమెంటును కూడా భాగం చేసి ఉంటే బావుండేది’ అన్నారు.

SC judge who opposed demonetisation: ఆర్బీఐ చట్టంలోని 26(2) సెక్షన్ లో ఏముంది?

కేంద్ర ప్రభుత్వం 2016, నవంబర్ 8న ఒక ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ ద్వారా నోట్ల రద్దు (demonetisation) నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ చట్టం(RBI Act)లోని సెక్షన్ 26(2) ప్రకారం ఈ నోటిఫికేషన్ ను కేంద్రం జారీ చేసింది. అయితే, ఈ సెక్షన్ ప్రకారం కూడా కేంద్రం సరిగ్గా వ్యవహరించలేదని జస్టిస్ నాగరత్న (Justice BV Nagarathna) పేర్కొన్నారు. ‘‘ఆర్బీఐ చట్టం(RBI Act)లోని సెక్షన్ 26(2) (Section 26(2)) ప్రకారం.. ఏదైనా కరెన్సీలో ఒక సిరీస్ కానీ, కొన్ని సిరీస్ లవి కానీ నోట్లను రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RB) కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తుంది. ఆ ప్రతిపాదనను పరిశీలించిన మీదట, కేంద్రం ఆ సిఫారసును అనుమతిస్తూ, నోటిఫికేషన్ ను జారీ చేస్తుంది. అంతేకానీ, గంపగుత్తగా, మొత్తం రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేయాలని (demonetisation) నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధం’’ అని జస్టిస్ నాగరత్న వివరించారు.

IPL_Entry_Point

టాపిక్