Digvijay Singh into Congress poll race కాంగ్రెస్ అధ్యక్ష పోరులో తెరపైకి మరో పేరు-digvijaya singh in congress presidential poll race ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Digvijaya Singh In Congress Presidential Poll Race

Digvijay Singh into Congress poll race కాంగ్రెస్ అధ్యక్ష పోరులో తెరపైకి మరో పేరు

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 05:30 PM IST

Digvijay Singh into Congress poll race: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు సాధారణ ఎన్నికలను మించి ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఈ అధ్యక్ష పదవి రేసులోకి తాజాగా మరొకరు అడుగుపెట్టారు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్

Digvijay Singh into Congress poll race: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగనున్నారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు బుధవారం వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Digvijay Singh into Congress poll race: సెప్టెంబర్ 30 నామినేషన్

పార్టీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈ నెల 30 న నామినేషన్ వెయ్యనున్నట్లు సమాచారం. ఆయన బుధవారం రాత్రి వరకు ఢిల్లీ చేరుకుంటారని, గురువారం పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Digvijay Singh into Congress poll race: గహ్లోత్ అనుమానమే..

ఇప్పటివరకు ఈ ఎన్నికల రేసులో ముందంజలో ఉన్న రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పోటీ చేయడంపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ విధానమైన ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న విధానం ప్రకారం, ఒకవేళ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికైతే, ఆయన రాజస్తాన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే, అందుకు గహ్లోత్ సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని ఆయన తన అనుయాయుల ద్వారా బయటపెట్టారు. తన ప్రత్యర్థి, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ సీఎం కావడం గహ్లోత్ కు ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో, బుధవారం సాయంత్రం గహ్లోత్ పార్టీ చీఫ్ సోనియాతో భేటీ కానున్నారు.

Digvijay Singh into Congress poll race: మరి కొందరు..

మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని మరి కొందరి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. పార్టీ సీనియర్ నేతలు శశి థరూర్, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ లు కూడా బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. ‘ గాంధీ’ కుటుంబం నుంచి అధ్యక్ష ఎన్నికల్లో ఎవరూ నిల్చోబోరని ఇప్పటికే సోనియా గాంధీ ప్రకటించారు.

IPL_Entry_Point