Diana Ramirez police officer : ఈమె.. ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసు!
Diana Ramirez police officer : ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసుగా.. గుర్తింపు తెచ్చుకున్నారు కొలంబియాకు చెందిన డయానా రామిరేజ్. కానీ మోడలింగ్ కోసం వృత్తిని వదులుకోనని తేల్చి చెబుతున్నారు.
Diana Ramirez police officer : కొలంబియాకు చెందిన ఓ మహిళా పోలీసు అధికారి.. ఇటీవలి కాలంలో వార్తలకెక్కారు. డయానా రామిరేజ్ను నెట్టింట అందరు.. 'ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసు'గా పొగిడేస్తున్నారు. డయానా రామిరేజ్కు చెందిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని పిక్స్, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ట్రెండింగ్ వార్తలు
'మోడలింగ్ చేయను.. వృత్తే ముఖ్యం'
ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రకారం.. కొలంబియాలోని మెడెల్లిన్ వీధుల్లో పాట్రోలింగ్ చేస్తూ ఉంటారు డయానా రామిరేజ్. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా గతంలో గుర్తింపు తెచ్చుకుంది మెడెల్లిన్. కానీ.. తనకు మోడలింగ్ కన్నా, ఉద్యోగమే ముఖ్యమని, దానిని వదులుకోనని చెబుతున్నారు డయానా రామిరేజ్.
Diana Ramirez Instagram : "నేను ఇప్పుడు ఓ పోలీసు అధికారిని. కేరీర్‌ను ఎంచుకునే విషయంలో నాకు మరో అవకాశం లభిస్తే.. అప్పుడు కూడా నేను పోలీసు వృత్తినే ఎంపిక చేసుకుంటాను. ఈ వ్యవస్థకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే.. ఈ వ్యవస్థే కారణం," అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు డయానా రామిరేజ్.
ఇన్‌స్టాఫెస్ట్ అవార్డులకు ఎంపిక..
ప్రముఖ ఇన్‌స్టాఫెస్ట్ ఆవార్డుల్లో.. 'బెస్ట్ పోలీస్/ మిలిటరీ ఇన్ఫ్లుయెంజర్ ఆఫ్ ది ఇయర్'కు డయానా రామిరేజ్ నామినేట్ అయ్యారు. భారీ సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే విధంగా డిజిటల్ కంటెంట్‌ను క్రియేట్ చేసే ప్రొఫెషనల్స్‌కు ఈ అవార్డులను ఇస్తారు.
"ఈ నామినేషన్‌తో.. పోలీసు శాఖకు ప్రాతినిథ్యం వహిస్తుండటం నాకు చాలా గర్వకారణం. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరి కష్టాన్ని, డెడికేషన్‌ను, దేశాన్ని మెరుగుపరిచేందుకు వారు చేస్తున్న కృషిని సోషల్ మీడియా గుర్తించి, ప్రపంచానికి చెబుతుంది," అని డయానా రామిరేజ్ అన్నారు.
Diana Ramirez : ఈ నేపథ్యంలో డయానా రామిరేజ్కు అభినందనలు వెల్లువెత్తాయి.
'ది మోస్ట్ బ్యూటిఫిల్ పోలీస్ ఆఫీసర్ ఆన్ ది ప్లానెట్' అని ఓ వ్యక్తి, డయానా రామిరేజ్ పోస్ట్‌పై కామెంట్ చేశారు. 'వావ్.. ఐ లవ్ హర్' అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు. "డెడికేటెడ్, ప్యాషనేట్, బ్యూటిఫుల్.. ఇంతకు మించి ఏం అడగగలరు?" అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4లక్షలకు పైగా మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో పురుషులే ఎక్కువ!
సంబంధిత కథనం
Instagram new feature: ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ ఫీచర్..
November 09 2022