DFCCIL recruitment 2023: డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల-dfccil recruitment 2023 apply for 237 executive jr executive posts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Dfccil Recruitment 2023: Apply For 237 Executive/ Jr Executive Posts

DFCCIL recruitment 2023: డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ లో ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Shutterstock)

DFCCIL recruitment: డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తి ఉన్ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ dfccil.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

DFCCIL recruitment: డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (Dedicated Freight Corridor Corporation of India Limited DFCCIL) లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఆసక్తి ఉన్ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ dfccil.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

DFCCIL recruitment: మొత్తం 535 పోస్ట్ లు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 535 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ జూన్ 19. ఈ లోపు అధికారిక వెబ్ సైట్ dfccil.com ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ అప్లికేషన్ ఫామ్స్ లోని తప్పొప్పులను సరి చేసుకోవడానికి జూన్ 26 నుంచి జూన్ 30 వరకు dfccil.com వెబ్ సైట్ లో కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. మొత్తం 535 పోస్ట్ ల్లో 354 పోస్ట్ లు జూనియర్ ఇంజినీర్ పోస్ట్ (Junior Engineer) లు కాగా, 181 పోస్ట్ లు జూనియర్ ఎగ్జిక్యూటివ్ (Junior Executive) పోస్ట్ లు. విద్యార్హతలు,అనుభవం, వయో పరిమితి వంటి పూర్తి వివరాల కోసం dfccil.com వెబ్ సైట్లోని డిటైల్డ్ నోటిఫికేషన్ ను అభ్యర్థులు పరిశీలించాలి.

DFCCIL recruitment: అప్లై చేసుకోవడం ఎలా?

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా dfccil.com వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపిస్తున్న “Advt. No. 01/DR/2023: Direct Recruitment from Open Market in Civil, Electrical, S&T, Operations & BD, Mechanical, Finance, HR & IT Departments of DFCCIL లింక్ పై క్లిక్ చేయాలి.
  • Click here to apply పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీ చెల్లించి, అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.

Notification here

WhatsApp channel