PM Modi degree: ప్రధాని మోదీ డిగ్రీ డిటైల్స్ అవసరం లేదు - గుజరాత్ కోర్టు
PM Modi degree: ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ కోర్టు స్పష్టం చేసింది.
PM Modi degree: ప్రధాని మోదీ (PM Modi) విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ కోర్టు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ (PM Modi) విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను బహిర్గతం చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషన్ దారు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు రూ. 25 వేల జరిమానా విధించింది.
ట్రెండింగ్ వార్తలు
PM Modi degree: ప్రధాని విద్యార్హతలపై వివాదం
ప్రధాని మోదీ (PM Modi) విద్యార్హతలకు సంబంధించిన సమాచారం అనవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రధాని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను చూపాలంటూ గతంలో ప్రధాన సమాచార కమిషనర్ (CIC) సంబంధిత యూనివర్సిటీలకు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. ప్రధాని మోదీ (PM Modi) విద్యార్హతలతకు సంబంధించిన సర్టిఫికెట్లను కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు చూపాలని 2016 ఏప్రిల్ లో నాటి సీఐసీ (CIC) శ్రీధర్ ఆచార్యులు ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లోని ప్రజా సంబంధాల అధికారిని (public information officer PIO), గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలోని పీఐఓ (PIO)లను ఆదేశించారు. సీఐసీ (CIC) ఆదేశాలపై గుజరాత్ యూనివర్సిటీ కోర్టుకు వెళ్లడంతో కోర్టు సీఐసీ (CIC) ఆదేశాలపై స్టే విధించింది. తాజాగా, సీఐసీ ఆదేశాలను కొట్టివేస్తూ, పిటిషనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు రూ. 25 వేల జరిమానా విధించింది.
PM Modi degree: కేజ్రీవాల్ స్పందన
గుజరాత్ కోర్టు తీర్పుపై ఢిల్లీ సీఎ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. నిరక్షరాస్యుడైన, లేదా తక్కువ చదువుకున్న వ్యక్తి దేశ ప్రధానిగా ఉండడం ప్రమాదకరమని ట్వీట్ చేశారు. ‘‘దేశ ప్రధాని ఏం చదువుకున్నారో తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదా? కోర్టుకు తన సర్టిఫికెట్లు చూపడానికి ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారు? ప్రధాని విద్యార్హతల సర్టిఫికెట్లు చూపాలని కోరిన వారికి జరిమానా విధిస్తారా? ఈ దేశంలో ఏం జరుగుతోంది? నిరక్షరాస్యుడైన, లేదా తక్కువ చదువుకున్న వ్యక్తి దేశ ప్రధానిగా ఉండడం చాలా ప్రమాదకరం’’ అని కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన ట్వీట్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.