Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్-delhi woman opens up about receiving unbelievable hate for muscular photo ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Muscular Photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

HT Telugu Desk HT Telugu
May 16, 2024 06:52 PM IST

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల ఆంచల్ అనేజా ఫిట్ నెస్ కోచ్ గా పనిచేస్తున్నారు. తాజాగా ఆమె ఎక్స్‌(ట్విటర్)లో షేర్ చేసిన ఓ ఫోటో కారణంగా ట్రోలింగ్ ను ఎదుర్కొంది.

తన కండరాలను ప్రదర్శిస్తున్న యువతి
తన కండరాలను ప్రదర్శిస్తున్న యువతి (X/@AanchalXIV)

ఫిట్‌నెస్ కోచ్ ఆంచల్ అనేజా (23) ఇటీవల తన ఫిట్‌నెస్ జర్నీని తెలియజేయడానికి "ముందు మరియు తరువాత" శీర్షికతో ఓ చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఆశించిన ప్రోత్సాహం లభించకపోగా విద్వేషపూరిత కామెంట్లు వెల్లువెత్తాయి.

"ఛాతీ శిక్షణ విషయానికి వస్తే, నేను మూడు కదలికలకు కట్టుబడి ఉంటాను" అని ఆమె క్యాప్షన్ ఇచ్చారు.

పోస్ట్‌కు కామెంట్స్ సెక్షన్‌లో కొందరు యూజర్లు నీచమైన, బాధాకరమైన ప్రతిస్పందనలతో ముంచెత్తారు. కొంతమంది ఆమె రూపాన్ని పురుషుడితో పోలుస్తూ బాడీ షేమింగ్ కు దిగారు.

న్యూఢిల్లీకి చెందిన ఆంచల్ ఫిట్‌నెస్ పట్ల తన తల్లిదండ్రుల అంకితభావాన్ని చూసి ఎల్లప్పుడూ ప్రేరణ పొందింది. తను మొదటగా డెకాథ్లాన్‌లో ఉద్యోగం చేసిన తరువాత, ఆమె తన సొంత కోచింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆమె తన క్లయింట్లకు శిక్షణ ఇస్తుంది.

ఆన్‌లైన్ ద్వేషంపై ఆంచల్ అనేజా ఎలా స్పందించింది?

నెగిటివిటీతో నిరుత్సాహపడ్డానని అనేజా అంగీకరించినప్పటికీ, ఆమె తెలివిగా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. "ట్రోలింగ్ వాస్తవానికి 25 కొత్త మంది కొత్త క్లయింట్లు నన్ను సంప్రదించేందుకు దారితీసింది. నేను ఇప్పటికే ముగ్గురిని క్లయింట్లుగా చేసుకున్నాను..’ అని ఆమె హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ట్రోల్స్ కు ఆంచల్ అనేజా సందేశం

"ద్వేషిస్తూ ఉండండి. ఎందుకంటే ఇది నన్ను మరింత ప్రాచుర్యంలోకి తెస్తోంది. కష్టపడి పనిచేయడమే విజయానికి కీలకమని గుర్తుంచుకోండి. మీకు ఏదైనా కావాలనుకుంటే, ప్రయత్నం చేయండి.." అని పేర్కొన్నారు.

ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత ఆంచల్ ట్రోల్స్‌ను ఉద్దేశించి 'నా కండరాలను చూపించే ఫోటోపై చాలా ద్వేషం చిమ్మారు' అని రాసుకొచ్చింది. ద్వేషం తనను బాధించకపోయినప్పటికీ, క్యాప్షన్లోని సమాచారాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం తనను నిరాశకు గురిచేసిందని ఆమె అన్నారు.

‘శీతాకాలంలో తీసిన ఫోటో అది. అప్పుడు నేను ఆరేడు కిలోలు ఎక్కువ బరువు ఉన్నాను. నేను బల్కింగ్ (కండరాల కోసం బరువు పెంచుకునే ప్రక్రియ) చేస్తున్నాను. నేను వాస్తవానికి బల్కింగ్ దశలను ఆస్వాదిస్తాను. ఈ వ్యాఖ్యలు నన్ను మరింత ఆలోచించడానికి ప్రేరేపించాయి. ఒక మహిళ కండరాలు పటిష్టం కావడం చాలా మంది పురుషుల అహంకారాలను ఎలా ఛిన్నాభిన్నం చేస్తుందనేది తమాషాగా ఉంది' అని వ్యంగ్యంగా ముగించారు.

ఆఫ్ లైన్ లోనూ ట్రోల్స్ ను ఎదుర్కొన్నానని అనేజా అంగీకరించింది. ‘కానీ నేను దానికి అలవాటు పడ్డాను. చాలా మందికి వారు అలా చేస్తున్నారని కూడా తెలియదు. నేను ఫిట్‌నెస్, ఆరోగ్యకరమైన జీవితం పట్ల మక్కువ కలిగి ఉన్నాను. అది మారదు..’ అని పేర్కొన్నారు.

IPL_Entry_Point

టాపిక్