No Schools as AQI declines: రేపటి నుంచి బడి బంద్.. కారణం ఇదే-delhi shuts primary schools as air quality deteriorates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Shuts Primary Schools As Air Quality Deteriorates

No Schools as AQI declines: రేపటి నుంచి బడి బంద్.. కారణం ఇదే

HT Telugu Desk HT Telugu
Nov 04, 2022 11:58 AM IST

No Schools as AQI declines: ఢిల్లీలో రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఢిల్లీని కమ్ముకున్న కాలుష్యం
ఢిల్లీని కమ్ముకున్న కాలుష్యం (PTI)

ఢిల్లీలో రేపటి నుంచి ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవడం కారణంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

గడిచిన మూడు నాలుగేళ్లుగా ఏటా అక్టోబరు చివరి వారంలో లేదా నవంబరు మొదటి వారంలో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుండడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నారు.

ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 500 పాయింట్లను టచ్ చేసింది. ఒక్కోసారి 1000 పాయింట్ల వరకు వెళ్లిన ఉదంతాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల ఉండే పంజాబ్, హర్యానాలో వరి, గోధుమ కోతలు పూర్తయ్యాక రైతులు ఆ గడ్డిని తగులబెట్టేస్తారు. దీంతో ఢిల్లీ చుట్టూ ఆ పొగలు అలుముకుంటాయి.అంతేకాకుండా ఢిల్లీ చుట్టూ ఉన్న పరిశ్రమలు, విద్యుత్త ఉత్పత్తి సంస్థలు, నిర్మాణ రంగం వల్ల కూడా తీవ్రమైన దుమ్మూదూళి వచ్చి చేరుతుంది. అలాగే విపరీతమైన వాహనాల రద్దీ వల్ల వాహనాల నుంచి వాయు కాలుష్యం తోడవుతుంది.

వీటన్నింటికి ముందుగా బలయ్యేది చిన్నపిల్లలే. అక్కడి పాఠశాల విద్యార్థులు ఈ వాయు కాలుష్యానికి బలై తరచూ దగ్గు, జలుబూ తదితర శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు.

టూరిస్టులు ఈ సమయంలో ఢిల్లీ వైపు వెళ్లకపోవడమే మంచిదని వైద్య నిపుణులు తరచూ సలహా ఇస్తుంటారు.

కాగా వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే సరిసంఖ్య రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు ఒకరోజు, బేసి సంఖ్య గల రిజిస్ట్రేషన్ నెంబరు ఉన్న వాహనాలు మరొక రోజు రోడ్లకు వచ్చేందుకు అనుమతి ఉంటుంది.

IPL_Entry_Point

టాపిక్