Shraddha murder: సూట్ కేసులో శరీర భాగాలు; శ్రద్ధవి గా అనుమానిస్తున్న పోలీసులు-delhi murder police find body parts in woods near surajkund ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Murder: Police Find Body Parts In Woods Near Surajkund

Shraddha murder: సూట్ కేసులో శరీర భాగాలు; శ్రద్ధవి గా అనుమానిస్తున్న పోలీసులు

HT Telugu Desk HT Telugu
Nov 25, 2022 06:20 PM IST

Shraddha murder: హరియాణాలోని ఫరీదాబాద్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పోలీసులకు మానవ శరీర భాగాలతో ఉన్న ఒక సూట్ కేసు లభించింది. సంచలనం సృష్టించిన శ్రద్ధ వాకర్ హత్యతో ఈ సూట్ కేసుకు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఢిల్లీలోని ఫొరెన్సిక్ ల్యాబ్ లో పోలీసులతో ఆఫ్తాబ్
ఢిల్లీలోని ఫొరెన్సిక్ ల్యాబ్ లో పోలీసులతో ఆఫ్తాబ్ (HT_PRINT)

Shraddha murder: ఫరీదాబాద్ లోని సూరజ్ కుండ్ ప్రాంతంలో గురువారం పోలీసులకు ఈ సూట్ కేసు లభించింది. అందులో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శరీర భాగాలు, కొన్ని ఎముకలు ఉన్నాయి. లివిన్ పార్ట్ నర్ ఆఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైన శ్రద్ధ వాకర్ శరీర భాగాలుగా వాటిని పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Shraddha murder: సీసీటీవీ ఫుటేజీ..

మే నెలలో తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధ వాకర్ ను ఆఫ్తాబ్ పూనావాలా గొంతు నులిమి చంపేసి, ఆ తరువాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, వాటిని ఒక్కొక్కటిగా దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేసిన విషయం తెలిసిందే. శ్రద్ధ వాకర్ శరీర భాగాల కోసం, ఆమె శరీరాన్ని కట్ చేయడానికి ఆఫ్తాబ్ ఉపయోగించిన రంపం, ఇతర ఆయుధాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా, ఫరీదాబాద్ దగ్గర్లోని సూరజ్ కుండ్ అటవీ ప్రాంతంలో లభించిన సూట్ కేసులోని శరీర భాగాలు శ్రద్ధ వాకర్ వే అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు.

Shraddha murder: డెంటల్ రికార్డ్స్

మరోవైపు, ఢిల్లీ పోలీసులు శ్రద్ధ వాకర్ ముంబైలో దంతాలకు చికిత్స తీసుకున్న ఆసుపత్రి నుంచి ఆమె డెంటల్ రికార్డ్స్ ను తీసుకున్నారు. ఇటీవల ఛాత్రపూర్ ప్రాంతంలో లభించిన కింది దవడ భాగంతో ఈ రికార్డులను సరిపోలుస్తున్నారు. అలాగే, ఆఫ్తాబ్ పై గురువారం జరిపిన పాలిగ్రాఫ్ పరీక్షలో తేలిన అంశాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపు 17 పోలీస్ టీమ్స్ ఈ దర్యాప్తులో పాల్గొంటున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆఫ్తాబ్, శ్రద్ధ కలిసి ఉన్న ఫ్లాట్ లో నుంచి పోలీసులు ఒక చిన్న రంపాన్ని, కొన్ని కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు.

IPL_Entry_Point