Girl travels in metro wearing bikini : తన చిత్ర, విచిత్ర డ్రెస్సింగ్ స్టైల్‌తో నిత్యం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ ఉంటుంది ఉర్ఫీ జావేద్. ఈమే గురించి నేటి యువతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై కామెంట్లు కూడా వేస్తుంటారు. అలాంటి వారికి దిమ్మతిరిగే ఘటన! ఓ యువతి.. బ్రా, మినీ స్కట్‌లో మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 'నువ్వు.. ఉర్ఫీని మించిపోయావుగా,' అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో, ఫొటోలు ఢిల్లీ మెట్రోలో తీసినవి. వీడియోలో.. తొలుత ఓ యువతి సీటులో బ్యాగ్ పట్టుకుని కూర్చోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆమె బ్యాగ్ తీసి సీటులో నుంచి లేచింది. అంతే! అక్కడున్న వారంతా కచ్చితంగా షాక్‌కు గురయ్యే ఉంటారు. ఆమె వేసుకున్న దుస్తులు అలాంటివి మరి. చాలా మంది.. షార్ట్స్‌లోనే ఇంటి బయటకు వెళ్లడానికి సిగ్గపడుతుంటారు. అలాంటిది.. ఆ యువతి ఏకంగా బికినీ స్టైల్లో బ్రా, మినీ స్కట్ వేసుకుని ఆ మెట్రోలో ప్రయాణిస్తుండటం విశేషం.
Girl in bikini travels in Delhi metro : ఈ వార్త ఇన్స్టెంట్గా వైరల్‌గా మారింది. చాలా మంది ఆ యువతి వేసుకున్న దుస్తులపై నెగిటివ్ కామెంట్లు పడుతున్నారు. అసభ్యకరంగా ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు.
Delhi metro viral video : "మహిళా సాధికారతకు ఇదే ఉదాహరణ అయితే.. ఈ తరం నవ యువతలు నాశనమైపోయినట్టే. సిగ్గులేని ఫెమినిస్ట్లకు ఇదే కావాలి. మన సంస్కృతిపై మారణహోమం జరుగుతోంది," అని నెటిజన్ తన ఆవేదన, ఆందోళనను వ్యక్తం చేశారు. 'ఈమె ఉర్ఫీ జావెద్ కాదు.. అంతకుమించి!' అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
కాగా.. ఢిల్లీ మెట్రోలో ఇటీవలే ఓ వ్యక్తి అండర్వేర్ వేసుకుని ప్రయాణించాడు. ఈ ఘటనను తాజా ఘటనతో కొందరు ముడిపెడుతున్నారు.
"ఓ వ్యక్తి.. తన అండర్గార్మెట్స్తో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించాడు. అతనిపై పోలీసులు కేసు వేశారు. ఈ యువతి న్యూడిటీకి సంబంధించిన లిమిట్స్ అన్నింటినీ దాటేసింది. మరీ ఇంకా ఎందుకు చర్యలు చేపట్టలేదు? లింగ సమానత్వం అంటే ఇదేనా?" అని ఓ నెటిజన్ ప్రశ్నించారు.
Delhi metro latest news : మరోవైపు.. కొందరు యువతికి మద్దతుగా నిలుస్తున్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలి? అన్న అంశంపై ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఉందని, అందులో తప్పేమీ లేదని చెబుతున్నారు.
సంబంధిత కథనం