Delhi MCD Exit Polls Results 2022: ఢిల్లీ ‘మున్సిపాలిటీ’.. తొలిసారి ఆప్ చేతికి!: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు-delhi mcd exit polls 2022 aam aadmi maiden win predicted in municipal corporation of delhi polls ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Delhi Mcd Exit Polls 2022 Aam Aadmi Maiden Win Predicted In Municipal Corporation Of Delhi Polls

Delhi MCD Exit Polls Results 2022: ఢిల్లీ ‘మున్సిపాలిటీ’.. తొలిసారి ఆప్ చేతికి!: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 05, 2022 09:25 PM IST

Delhi MCD Exit Polls 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం.. ఆమ్‌ఆద్మీ పార్టీ వశం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆప్.. పురపాలికను కూడా కైవసం చేసుకుంటుందని వెల్లడించాయి.

Delhi MCD Exit Polls Results 2022: ఢిల్లీ ‘మున్సిపాలిటీ’.. తొలిసారి ఆప్ చేతికి! (ANI Photo)
Delhi MCD Exit Polls Results 2022: ఢిల్లీ ‘మున్సిపాలిటీ’.. తొలిసారి ఆప్ చేతికి! (ANI Photo) (Amit Sharma)

Municipal Corporation of Delhi (MCD) 2022 Exit Polls: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ను ఆమ్‍ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP) తొలిసారి కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. 250 వార్డులు ఉన్న ఢిల్లీ నగరపాలక సంస్థ (MCD) పీఠం ఆప్‍దేనని స్పష్టం చేశాయి. 126 మెజార్టీ మార్కును సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ దాటుతుందని వెల్లడించాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం (డిసెంబర్ 4) జరిగింది. సుమారు 50శాతం పోలింగ్ నమోదైంది. 2007 నుంచి ఢిల్లీ కార్పొరేషన్‍లో బీజేపీనే గెలుస్తోంది. అయితే రాష్ట్రాన్ని పాలిస్తున్న ఆమ్‍ఆద్మీ తొలిసారి ఎంసీడీని దక్కించుకుంటుందని నేడు (డిసెంబర్ 5) వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిట్ పోల్స్

Delhi MCD Exit Polls

ఆజ్ తక్ - యాక్సిస్ మై ఇండియా

  • ఆమ్‍ఆద్మీ: 149-171
  • బీజేపీ: 69-91
  • కాంగ్రెస్: 3-7
  • ఇతరులు: 5-9

న్యూస్ ఎక్స్ - జన్ కీ బాత్

  • ఆమ్‍ఆద్మీ: 159-175
  • బీజేపీ: 70-92
  • కాంగ్రెస్: 4-7
  • ఇతరులు: 01

టైమ్స్ నౌ - ఈటీజీ

  • ఆమ్‍ఆద్మీ: 146-156
  • బీజేపీ: 84-94
  • కాంగ్రెస్: 6-10
  • ఇతరులు: 0-4

జీ న్యూస్-బీఏఆర్సీ

  • ఆమ్‍ఆద్మీ: 134-146
  • బీజేపీ: 82-94
  • కాంగ్రెస్: 8-14
  • ఇతరులు: 14-19

టీవీ9 నెట్‍వర్క్

  • ఆమ్‍ఆద్మీ: 145
  • బీజేపీ: 94
  • కాంగ్రెస్: 8
  • ఇతరులు: 3

ఆప్‍కు ఊరట

Delhi MCD Exit Polls 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍లో విజయం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచించడం ఆమ్‍ఆద్మీ పార్టీకి ఊరటగా ఉంది. ఎందుకంటే గుజరాత్‍లో ఆప్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆ పార్టీకి గుజరాత్‍లో ఐదు స్థానాలు కూడా రావడం కష్టమేనని చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ ఖాతా తెరవడం కూడా కష్టమేనని వెల్లడించాయి. ఇలాంటి తరుణంలో.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍.. తొలిసారి తమ వశమవుతుందని తేలడం సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీకి సానుకూల అంశంగా ఉంది. బీజేపీ కూడా ఈసారి ఎంసీడీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచారాన్ని ముమ్మరంగా చేసింది. అయితే కేజ్రీవాల్.. ఇమేజ్ ఈసారి బాగా పని చేసిందని అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.

WhatsApp channel

టాపిక్