Delhi: ఇద్దరు కిల్లర్లతో భార్యను చంపించిన 71 ఏళ్ల వ్యక్తి.. ఎందుకంటే!-delhi man hires killer to murder 35 year old wife said corps ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi: ఇద్దరు కిల్లర్లతో భార్యను చంపించిన 71 ఏళ్ల వ్యక్తి.. ఎందుకంటే!

Delhi: ఇద్దరు కిల్లర్లతో భార్యను చంపించిన 71 ఏళ్ల వ్యక్తి.. ఎందుకంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
May 18, 2023 06:43 AM IST

Delhi: 35 ఏళ్ల తన భార్యను ఇద్దరితో హత్య చేయించాడు ఓ 71 ఏళ్ల వ్యక్తి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Delhi: 35 ఏళ్ల భార్యను ఇద్దరు రౌడీలతో ఓ 71ఏళ్ల వ్యక్తి హత్య చేయించాడు. ఆ కిల్లర్లు ఆమెను కత్తులతో పొడిచి చంపారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. పశ్చిమ ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ (Rajouri Gardens) ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలివే.

Delhi: పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే ఆ మహిళ చనిపోయారు. ఆమె శరీరంపై చాలా కత్తిపోట్లు ఉన్నాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఎస్‍కే గుప్తా అనే వ్యక్తి.. గత నవంబర్‌లో ఆమెను రెండో వివాహం చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. విచారణ చేశారు.

పక్షవాతంతో దివ్యాంగుడైన తన కొడుకు అమిత్ బాగోగులను చూసుకునేందుకు గుప్తా.. 35 ఏళ్ల ఆ మహిళను గతేడాది రెండో పెళ్లి చేసుకున్నాడని విచారణలో తేలింది. అయితే అమిత్‍ను ఆ మహిళ సరిగా చూసుకోలేదు. పట్టించుకోలేదు. దీంతో ఆమెకు విడాకులు ఇవ్వాలని గుప్తా నిర్ణయించుకున్నారు. అయితే, విడాకుల కోసం ఆమె రూ.కోటి డిమాండ్ చేశారు. ఈ విషయాలను ఓ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు.

Delhi: అయితే, ఆమె డిమాండ్‍కు గుప్తా అంగీకరించలేదు. ఎలాగైనా ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.

Delhi: పోలీసులు తెలిపిన వివరాల మేరకు, అమిత్‍ను తరచూ ఆసుపత్రికి తీసుకెళ్లే విపిన్ అనే వ్యక్తితోనే గుప్తా.. తన భార్య హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గుప్తా, అమిత్, విపిన్ ముగ్గురూ ప్లాన్ వేశారు. ఈ హత్య చేస్తే రూ.10లక్షలు ఇస్తానని విపిన్‍కు ఎస్‍కే గుప్తా చెప్పారు. ముందుగా రూ.2.5లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు.

ప్లాన్ ప్రకారం, విపిన్, అతడి అనుచరుడు హిమాన్షు.. గుప్తా ఇంటికి వెళ్లి ఆ మహిళపై కత్తులతో దాడి చేశారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకు ఆ ఇద్దరు ఇంట్లో దోపిడీ చేశారు. బాధితురాలి మొబైల్ ఫోన్‍తో పాటు అమిత్ మొబైల్ కూడా తీసుకెళ్లారు. దీన్ని దొంగతనంగా చిత్రీకరించాలని ప్రయత్నించారని ఆ పోలీస్ అధికారి తెలిపారు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో అమిత్ కూడా ఉన్నారని వెల్లడించారు.

Delhi: దర్యాప్తు ఆధారంగా నలుగురు నిందితులు - ఎస్‍కే గుప్తా, అతడి కుమారుడు అమిత్, కాంట్రాక్ట్ కిల్లర్లు విపిన్ సేథి, హిమాన్షును అరెస్టు చేసినట్టు ఆ పోలీస్ సీనియర్ అధికారి తెలిపారు. ఈ నేరానికి పాల్పడినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. మొబైళ్లు, రక్తం అంటిన దుస్తులు, హంతకులు ఉపయోగించిన స్కూటర్లను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

Whats_app_banner