Aravind Kejriwal bail :దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలు ఉన్న ఆయనకు ఓ ట్రయల్ కోర్టు గురువారం బైయిల్ మంజూరు చేయగా.. కేజ్రీవాల్ విడుదలను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. కేజ్రీవాల్ బెయిల్‌కి వ్యతిరకంగా ఈడీ సవాలు చేయడమే ఇందుకు కారణం.
దిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీహార్ జైలు నుంచి విడుదలవ్వాల్సి ఉంది. ఆయన్ని కలిసేందుకు.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కేజ్రీవాల్ భార్య సునీతాలు జైలు వద్దకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. కానీ ట్రయల్ కోర్టు తీర్పుపై అత్యవసర విచారణ జరపాలని దిల్లీ హైకోర్టును కోరింది ఈడీ. ఫలితంగా.. తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదలను కోర్టు నిలిపివేసింది.
Delhi liqour policy scam : రూ. 1లక్ష పూచికొత్తు, పలు నిబంధనలతో కేజ్రీవాల్‌కి గురువారం బెయిల్‌ని మంజూరు చేసింది ట్రయల్ కోర్టు. లిక్కర్ పాలసీ కేసు సాక్షులను ప్రభావితం చేసేందుకు, ఈడీ దర్యాప్తునకు భంగం కలిగించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని కండీషన్లు పెట్టి బెయిల్ ఇచ్చింది.
కానీ.. అరవింద్ కేజ్రీవాల్ బయటకు వస్తే, కేసు దర్యాప్తు కచ్చితంగా ప్రభావితం అవుతుందని ఈడీ చెబుతూ వస్తోంది. ఇదే విషయంపై శుక్రవారం.. దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. మరి ఈ విచారణలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
“మోదీ ప్రభుత్వం చేస్తున్న రౌడీయిజాన్ని చూడండి. ట్రయల్ కోర్టు ఆర్డర్ ఇంకా రాలేదు. ఆదేశాలకు సంబంధించిన కాపీ బయటకే రాలేదు. కానీ మోదీకి చెందిన ఈడీ మాత్రం.. ఏ ఆర్డర్‌ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లింది? ఈ దేశంలో అసలేం జరుగుతోంది? మోదీజీ.. న్యాయవ్యవస్థను ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? మొత్తం దేశం చూస్తోంది,” అని సంజయ్ సింగ్ అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండింగ్ చేశారంటూ.. మార్చ్ 21ని కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. పాలసీ ద్వారా అక్రమంగా సంపాదించిన సొత్తును.. గోవాలో పార్టీ ప్రచారాలకు వినియోగించుకున్నారని ఆరోపించింది. తాను ఏ తప్పూ చేయాలని ఆయన కోర్టులో వాదించారు.
Aravind Kejriwal latest news : 2024 లోక్‌సభ ఎన్నికల కోసం అరవింద్ కేజ్రీవాల్‌కి దాదాపు 15 రోజుల పాటు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన తిరిగి తీహార్ జైలుకు వెళ్లిపోయారు.
సంబంధిత కథనం