Delhi floods: జల దిగ్భంధంలో దేశ రాజధాని.. నీట మునిగిన పలు ప్రాంతాలు-delhi deluge yamuna submerges metro station floods railway tracks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Floods: జల దిగ్భంధంలో దేశ రాజధాని.. నీట మునిగిన పలు ప్రాంతాలు

Delhi floods: జల దిగ్భంధంలో దేశ రాజధాని.. నీట మునిగిన పలు ప్రాంతాలు

HT Telugu Desk HT Telugu
Jul 13, 2023 07:18 PM IST

Delhi deluge: యమున నది వరదలకు ఢిల్లీ నగరం జల దిగ్భంధంలో చిక్కుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఢిల్లీలోని ఓల్డ్ యమున బ్రిడ్జి వద్ద వరద నీటిలో మునిగిన వాహనాలు
ఢిల్లీలోని ఓల్డ్ యమున బ్రిడ్జి వద్ద వరద నీటిలో మునిగిన వాహనాలు (Hindustan Times)

Delhi deluge: యమున నది (river Yamuna) వరదలకు ఢిల్లీ (Delhi) నగరం జల దిగ్భంధంలో చిక్కుకుంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలు నీటిలో చిక్కుకుపోయాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Trains cancelled: రైళ్ల రద్దు

యమున నది మహోగ్రంగా, ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఢిల్లీలోని నది సమీప ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకువచ్చింది. నదిలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. గురువారం యమున నదిలో 208.48 మీటర్ల గరిష్ట నీటిమట్టం ఉంది. మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు తోడు, హరియాణా నుంచి వచ్చిన వరద నీరు యమున నది ఉగ్ర రూపానికి కారణమయ్యాయి. వరద నీరు ఢిల్లీ లోని ఎర్ర కోటలోకి కూడా చేరింది. ఎర్ర కోటలో మోకాల్లోతు నీరు నిలిచింది. రైల్వే ట్రాకుల పైకి నీరు చేరడంతో, జులై 7 నుంచి జులై 15 మధ్య దాదాపు 300 ఎక్స్ ప్రెస్ రైళ్లను, 406 ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేశారు.

Kejriwal urges Delhi people: ఇళ్లల్లోనే ఉండండి..

దేశ రాజధాని ఢిల్లీలో వరద పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో.. ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నగర ప్రజలను కోరారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని కోరారు. ఉద్యోగస్తులు ఇంటి నుంచే పని చేయాలని కోరారు. వర్షాలు, వరదల కారణంగా సోమవారం వరకు ఢిల్లీలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరద నీరు యమున బ్యాంక్ మెట్రో స్టేషన్ ని ముంచెత్తింది. దాంతో మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. గురువారం సాయంత్రం నుంచి యమున నదిలో నీటి మట్టం తగ్గే అవకాశముంది.