Life certificate : డెడ్లైన్ అలర్ట్! ఇలా చేయకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది..
Life certificate : డెడ్లైన్ అలర్ట్! జీవన ధ్రువీకరణ పత్రాల సమర్పణకు చివరి తేదీ సమీపిస్తోంది. ఇలా చేయకపోతే మీ పెన్షన్ ఆగిపోతుంది!
పింఛన్లు అందుకోవడం కొనసాగించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ తమ జీవిత ధ్రువీకరణ పత్రాలను (జీవన్ ప్రమాణ్ పత్రం) ప్రతి సంవత్సరం నవంబర్ నెలాఖరులోగా సమర్పించాలి. ఈ డెడ్లైన్ సమీపిస్తున్న తరుణంలో లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
జీవిత ధ్రువీకరణ పత్రాలు..
సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం సులువైంది. పెన్షనర్లు తమ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించడానికి మూడు ఆప్షన్స్ ఉన్నాయి, అవి.. వ్యక్తిగతంగా, ఆన్లైన్ లేదా డోర్ స్టెప్ బ్యాంకింగ్!
లైఫ్ సర్టిఫికేట్ చెల్లుబాటు అనేది చివరిగా సమర్పించిన తేదీ నుంచి ఒక సంవత్సరం మాత్రమే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
లైఫ్ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్..
- పిపిఓ నంబర్
- -ఆధార్ నంబర్
- -బ్యాంక్ ఖాతా వివరాలు
- -ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్
సమర్పించడానికి చివరి రోజు..
80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెన్షనర్లు తమ జీవన ధృవీకరణ పత్రాలను సమర్పించడం అక్టోబర్ 1, 2024 నుంచి ప్రారంభించారు. ఇతరులకు జీవన్ ప్రమాణ్ పాత్ర సమర్పణ ప్రక్రియ నవంబర్ 1 నుండి ప్రారంభమైంది. సాధారణంగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ప్రభుత్వం పొడిగించకపోతే నవంబర్ 30 వరకు ఉంటుంది.
పెన్షనర్లు నవంబర్ 30 డెడ్లైన్ మిస్ అయితే ఏమవుతుంది?
నవంబర్ 30లోపు మీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మీ పెన్షన్ రద్దవుతుంది. సర్టిఫికెట్ సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్స్ (సీపీసీ)కి వచ్చిన తర్వాతే డబ్బులు విడుదలవుతాయి.
డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 3.0..
రిటైర్ అయిన వారికి డిజిటల్ సాధికారత కల్పించేందుకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీఎల్ సీ) క్యాంపెయిన్ 3.0ను ప్రారంభించారు.
2014లో మొదటిసారి ప్రకటించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ్ అని కూడా పిలుస్తారు.
1,900 శిబిరాలు, 1,100 మంది నోడల్ అధికారులతో, డీఎల్సీ క్యాంపెయిన్ 3.0 2024 నవంబర్ 1 నుంచి 30 వరకు 800 భారతీయ నగరాలు, పట్టణాల్లో నిర్వహించనుంది. పదవీ విరమణ చేసిన వారందరూ తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), పెన్షన్ పంపిణీ బ్యాంకుల ద్వారా లేదా వారి స్వంత ఇంటి నుంచి సులభంగా సమర్పించవచ్చని అధికారిక ప్రకటన పేర్కొంది.
సంబంధిత కథనం
టాపిక్