Dalit woman gangraped : దళిత మహిళపై సామూహిక అత్యాచారం..-dalit woman allegedly gangraped by family priest others in rajasthan ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Dalit Woman Allegedly Gangraped By Family Priest, Others In Rajasthan

Dalit woman gangraped : దళిత మహిళపై సామూహిక అత్యాచారం..

Sharath Chitturi HT Telugu
Oct 09, 2022 06:33 PM IST

Dalit woman gangraped in Rajasthan : ఆమెపై ఓ పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చి మరికొందరు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లో చోటుచేసుకుంది.

దళిత మహిళపై సామూహిక అత్యాచారం..
దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. (Representational image.)

Dalit woman gangraped in Rajasthan : రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఓ పూజారి కూడా ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

ఎవరు లేని సమయంలో వచ్చి..

బాధితురాలు.. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి అజ్మేర్​లో జీవిస్తోంది. సంజయ్​ శర్మ అనే వ్యక్తి.. ఆమె ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాడు.

పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నెల రోజులుగా మహిళపై సంజయ్​ శర్మ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఓ రోజు.. ఇంట్లో ఎవరు లేని సమయంలో తొలిసారి అమెను రేప్​ చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఎవరికైనా చెబితే.. వీడియోలు వైరల్​ చేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలతో బెదిరించి మహిళ నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోతే ఆమె భర్తను చంపేస్తానని బెదిరించాడు.

నెల రోజులుగా మహిళపై అత్యాచారం జరుగుతూనే ఉంది! మత్తు మందు ఇచ్చి పలువురు ఆమెను రేప్​ చేశారు. మత్తులో ఉండటంతో వారిని ఆమె గుర్తుపట్టలేకపోతోంది. ఎంత మంది ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అన్నది కూడా మహిళకు తెలియదు.

ఇంకా ఎవరిని అరెస్ట్​ చేయలేదు!

Rajasthan dalit woman raped : ఓ రోజు భార్య ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆందోళనకు గురైన భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత గత నెల 27న.. ఆ మహిళను నిందితుడు సంజయ్​.. పోలీస్​ స్టేషన్​కు సమీపంలో విడిచిపెట్టి వెళ్లిపోయాడు.

కొన్ని రోజుల తర్వాత.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. ఘటనపై ఈ నెల 7న పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకున్నారు. మహిళపై వైద్య పరీక్షలు నిర్వహించారు.

కాగా.. ఈ ఘటనలో పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్ట్​ చేయలేదు.

దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్​లో నేరాల తీవ్రత ఆందోళనకరంగా ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. మహిళలపై నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ భద్రతపై సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. 

WhatsApp channel

సంబంధిత కథనం