Cyclone Gabrielle : 'గాబ్రియెల్​' ఎఫెక్ట్​.. అంధకారంలో న్యూజిలాండ్​!-cyclone gabrielle lashes northern new zealand with strong winds and rain ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cyclone Gabrielle Lashes Northern New Zealand With Strong Winds And Rain

Cyclone Gabrielle : 'గాబ్రియెల్​' ఎఫెక్ట్​.. అంధకారంలో న్యూజిలాండ్​!

Sharath Chitturi HT Telugu
Feb 13, 2023 08:03 AM IST

New Zealand Cyclone Gabrielle : న్యూజిలాండ్​వైపు గ్రాబియెల్​ తుపాను దూసుకెళుతోంది. కొన్ని రోజుల క్రితమే రికార్డు స్థాయి వరదలతో అల్లాడిపోయిన ప్రజలు.. ఇప్పుడు ఈ వార్తతో భయాందోళనకు గురవుతున్నారు.

తుపాను కారణంగా.. తీరం వద్ద ఎగిసిపడుతున్న కెరటాలు
తుపాను కారణంగా.. తీరం వద్ద ఎగిసిపడుతున్న కెరటాలు (AP)

New Zealand Cyclone Gabrielle latest news : వరుసగా వచ్చి పడుతున్న ప్రకృతి విపత్తులతో న్యూజిలాండ్​ వణికిపోతోంది. భారీ వరదలతో ఇటీవల కుదేలైన ఆ ప్రాంతం ముంగిట ఇప్పుడు పెను తుపాను నిలబడింది! గాబ్రియెల్​ తుపాను ధాటికి ఇప్పటికే 58వేల నివాసాలు అంధకారంలోకి జారుకున్నాయి. తీర ప్రాంతాల్లో కెరటాలు ఎగిసిపడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

గాబ్రియెల్​ ఎఫెక్ట్​..

ప్రస్తుతం.. న్యూజిలాండ్​కు ఉత్తరాన ఈ గాబ్రియెల్​ తుపాను కేంద్రీకృతమై ఉంది. సోమవారం- మంగళవారం ఇది తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడి వాతావరణశాఖ ప్రజలను హెచ్చరించింది.

Cyclone Gabrielle live updates : "గాబ్రియెల్​ తుపాను ప్రభావం ఇంకా తక్కువగానే ఉంది. మరికొన్ని గంటల్లో తీవ్రత పెరగొచ్చు. సోమవారం అర్ధరాత్రి- మంగళవారం తెల్లవారుజామున తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు," అని ఆక్లాండ్​ ఎమర్జెన్సీ మేనేజ్​మెంట్​ పేర్కొంది.

న్యూజిలాండ్​లోని అప్పర్​ నార్త్​ ఐల్యాండ్​తో పాటు ఆక్లాండ్​లోని అనేక స్కూళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. అవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు పెట్టుకోకపోవడం సురక్షితమని ఆదేశాలు జారీ అయ్యాయి. అక్లాండ్​తో పాటు నాలుగు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది అక్కడి ప్రభుత్వం.

భారీ వర్షాలతో జలమయమైన ఆక్లాండ్​ రోడ్లు
భారీ వర్షాలతో జలమయమైన ఆక్లాండ్​ రోడ్లు

తుపాను కారణంగా రవాణా వ్యవస్థకు నష్టం జరిగిందని తెలుస్తోంది. పలు విమానాలు, బస్సులు, ఫెర్రీల రాకపోకలు నిలిచిపోయినట్టు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్టుు సమాచారం.

రికార్డు స్థాయిలో వరదలు..

New Zealand floods 2023 : గత నెలలో వరదలు సృష్టించిన బీభత్సానికి.. ఆక్లాండ్​తో పాటు పరిసర ప్రాంతాలు ఇంకా తేరుకోలేదు. కొన్ని వారాల క్రితమే.. భారీ వర్షాలతో ఆక్లాండ్​ అతలాకుతలమైంది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇక ఇప్పుడు తుపాను వార్తలతో ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

IPL_Entry_Point