Southwest monsoon : దక్షిణాదిలో వర్షాలు.. ఉత్తర భారతంలో హీట్ వేవ్!
Southwest monsoon in Kerala : కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. బిపర్జాయ్ తుపాను మరింత బలపడనుంది. ఉత్తర భారతంలో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Southwest monsoon in Kerala : అరేబియా సముద్రంలో పుట్టుకొచ్చిన బిపర్జాయ్ తుపాను.. 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చనుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 3 రోజుల్లో.. ఉత్తర- వాయువ్యంవైపు తుపాను ప్రయాణిస్తుందని పేర్కొంది.
ఐఎండీ ప్రకారం.. దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 4 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో మాత్రం.. సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వానలు పడతాయి. ఇక లక్షద్వీప్‌లో ఆదివారం వరకు వర్షాలు కురుస్తాయి.
కేరళలో యెల్లో అలర్ట్..
నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళలోని 8 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. తిరువనంతపురం, కొల్లమ్, పథనమ్‌తిట్ట, అలాప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, కొజికోడ్, కన్నూర్ జిల్లాలకు యెల్లో అలర్ట్ కొనసాగుతోంది.
ఇదీ చూడండి:- Monsoon Updates:ఏపీకి చల్లటి కబురు.. మరో రెండు మూడు రోజుల్లో సీమను తాకనున్న 'నైరుతి'
Cyclone Biparjoy latest updates : సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈ ఏడాది జూన్ 8న అవి కేరళలోకి ప్రవేశించాయి. అయితే.. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను కారణంగా.. రుతుపవనాల కదలిక నెమ్మదిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే జూన్ 15 నాటికి రుతుపవనాల వల్ల కురవాల్సిన వర్షాలు.. సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఈ రాష్ట్రాల్లో హీట్ వేవ్..
Heat wave news in India : వర్షాల కారణంగా కేరలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. ఉత్తర భారతంలోని దాదాపు 7 రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు ఇచ్చింది. బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వరకు హీట్ వేవ్ ప్రభావం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పశ్చిమ్ బెంగాల్‌లోని గంగా నది ప్రాంతం, ఒడిశా- ఝార్ఖండ్‌లోని పలు ప్రదేశాల్లో హీట్ వేవ్ ఎఫెక్ట్ సోమవారం వరకు ఉంటుందని పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌లో శనివారం వరకు వడగాల్పులు కొనసాగుతాయని వివరించింది.
సంబంధిత కథనం