Caste census : అన్ని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో.. కుల గణన!-cwc unanimously supported idea of caste census in country rahul gandhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cwc Unanimously Supported Idea Of Caste Census In Country: Rahul Gandhi

Caste census : అన్ని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో.. కుల గణన!

Sharath Chitturi HT Telugu
Oct 09, 2023 05:20 PM IST

Congres on Caste census : కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో కుల గణన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.

అన్ని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో.. కుల గణన!
అన్ని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో.. కుల గణన! (Congress Twitter)

Congres on Caste census : బిహార్​లో కుల గణన వ్యవహారంపై సర్వత్రా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ. కులాల వారీగా జనాభాను లెక్కిస్తే.. అది చాలా ప్రగతిశీల, శక్తివంతమైన నిర్ణయం అవుతుందని అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

దిల్లీ వేదికగా సోమవారం సీడబ్ల్యూసీ (కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ) జరిగింది. కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా అనేక మంది సీనియర్​ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన విషయాన్ని ప్రస్తావించారు రాహుల్​ గాంధీ.

Rahul Gandhi on Caste census : "సీడబ్ల్యూసీలో ఈరోజు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాము. దేవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్న ఆలోచనను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా మద్దతుపలికింది. ఇది పేదలకు ఒక శక్తివంతమైన వరం లాంటిది. ఇది ప్రొగ్రెసివ్​, హిస్టారిక్​, పవర్​ఫుల్​. మా సీఎంలు (కర్ణాటక, హిమాచల్​ ప్రదేశ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​)లు కూడా ఈ కుల గణనపై సానుకూలంగా ఉన్నారు. ఈ విషయంపై త్వరలోనే చర్యలు తీసుకుంటాము," అని రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు రాహుల్​ గాంధీ.

"సర్వేను చేపట్టకుండా ఉండేదుకు.. ప్రధాని విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు. కుల గణన చేయడం ఆయన వల్ల కాదు. మా నలుగురు ముఖ్యమంత్రుల్లో.. ముగ్గురు ఓబీసీ కేటగిరీ నుంచి వచ్చిన వారే. మరి బీజేపీ సీఎంల పరిస్థితేంటి? ప్రధాని.. ఓబీసీల కోసం పనిచేయరు. ప్రధాన సమస్యల నుంచి దారి మళ్లించడమే ఆయన పని," అని మండిపడ్డారు రాహుల్​ గాంధీ.

Bihar Caste census : "ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు.. రానున్న రోజుల్లో ప్రధాని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇది రాజకీయ నిర్ణయం కాదు. కుల గణన అనేది న్యాయంపై తీసుకునే నిర్ణయం," అని రాహుల్​ గాంధీ అన్నారు.

బిహార్​లో కుల గణన చేపట్టిన నితీశ్​ కుమార్​ ప్రభుత్వం.. ఇటీవలే సంబంధిత సర్వేలోని డేటాను బయటపెట్టింది.

CWC Caste census in India : ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల్లో కుల గణన అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాము కూడా కుల గణన చేపడతామని ఇప్పటికే స్పష్టం చేశారు రాజస్థాన్​ సీఎం అశోక్​ గహ్లోత్​. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్​గఢ్​లో తిరిగి అధికారాన్ని ఇస్తే.. రాష్ట్రవ్యాప్తంగా కుల గణన చేపడతామని హామీనిచ్చారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.

IPL_Entry_Point

సంబంధిత కథనం