CWC Recruitment 2023: సీడబ్ల్యూసీలో ఇంజనీర్ పోస్ట్ లకు అప్లై చేశారా? రేపే లాస్ట్ డేట్
CWC Recruitment: సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఇంజనీర్ పోస్ట్ లకు అప్లై చేయడానికి సెప్టెంబర్ 24 వ తేదీ లాస్ట్ డేట్. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సీడబ్ల్యూసీ వెబ్ సైట్ cwceportal.com ద్వారా అప్లై చేసుకోవచ్చు.
CWC Recruitment: సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ 139 అసిస్టెంట్ ఇంజనీర్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ (జనరల్) మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 24న ముగియనుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ cwceportal.com ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు
వేకెన్సీల వివరాలు..
వివిధ విభాగాల్లోని మొత్తం 139 పోస్ట్ లను భర్తీ చేయడానికి సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ వివరాలు..
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 18
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 5
- అకౌంటెంట్: 24
- సూపరింటెండెంట్ (జనరల్): 11
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 81
అప్లికేషన్ ఫీజు
అన్‌రిజర్వ్‌డ్ (UR), EWS మరియు OBC కేటగిరీల పరిధిలోకి వచ్చే పురుష అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 1,250. అలాగే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిళలు రూ. 400 చెల్లిస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజులు అభ్యర్థులు ఆన్ లైన్ లో ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు ద్వారా కానీ, ఏదైనా యూపీఐ ద్వారా కానీ చెల్లించవచ్చు.
ఇలా అప్లై చేయండి..
- ఇప్పటివరకు అప్లై చేయని అర్హులైన అభ్యర్థులు ఈ కింది స్టెప్ట్ ఫాలో కావడం ద్వారా అప్లై చేయవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్ సైట్ cwceportal.com ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే career ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
- CLICK HERE TO APPLY ONLINE FOR ADVERTISEMENT NO. 2023/01 అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
- సబ్మిట్ బటన్ నొక్కాలి.
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.