CUET UG 2023: సీయూఈటీకి అప్లై చేసుకోవడానికి మార్చి 30 లాస్ట్ డేట్; త్వరపడండి..
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన సీయూఈటీ (Common University Entrance Test CUET UG) కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 30.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన సీయూఈటీ యూజీ (Common University Entrance Test CUET UG) కి దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ కు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మార్చి 30.
CUET UG 2023: ఆన్ లైన్ అప్లై
ఈ సీయూఈటీ యూజీ 2023 (Common University Entrance Test CUET UG 2023) కి విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లై అప్లై చేసుకోవడానికి సీయూఈటీ అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in. ను సందర్శించాలి. ఈ ప్రవేశ పరీక్షను ఎన్టీఏ (National Testing Agency, NTA) నిర్వహిస్తుంది. మార్చి 30 లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తరువాత దరఖాస్తు ఫామ్ లోని తప్పొప్పులను సరి చేసుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు కరెక్షన్ విండో (correction window) ఓపెన్ అవుతుంది. పరీక్ష కేంద్రం వివరాలను ఏప్రిల్ 30న ప్రకటిస్తారు. ఈ సీయూఈటీ యూజీ 2023 (Common University Entrance Test CUET UG 2023) అడ్మిట్ కార్డ్స్ మే రెండవ వారం నుంచి ఆన్ లైన్ లో cuet.samarth.ac.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. వాటిని విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీయూఈటీ యూజీ 2023 (Common University Entrance Test CUET UG 2023) పరీక్ష మే 21న జరుగుతుంది. మొత్తం 13 భాషల్లో ఈ CUET UG 2023 ని నిర్వహిస్తారు.
CUET UG 2023 : అప్లై చేయడం ఎలా?
- సీయూఈటీ యూజీ అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే CUET UG 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
- వివరాలు ఫిల్ చేసి లాగిన్ కావాలి.
- అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. సబ్జెక్టుల వారీగా ఫీజు ఉంటుంది.
- అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేసి, హార్డ్ కాపీని భద్ర పర్చుకోవాలి.
- పూర్తి వివరాల కోసం cuet.samarth.ac.in. లోని నోటిఫికేషన్ ను చూడండి.