CUET Result 2023: సీయూఈటీ యూజీ ఫలితాలపై కీలక అప్డేట్; రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..
CUET Result 2023: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో డిగ్రీ ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2023) ఫలితాలు మరో రెండు రోజుల్లోపు వెలువడనున్నాయి. ఆ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను cuet.samarth.ac.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
CUET Result 2023: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో డిగ్రీ ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET UG 2023) ఫలితాలు మరో రెండు రోజుల్లోపు వెలువడనున్నాయి. ఆ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను cuet.samarth.ac.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
ప్రొవిజనల్ ఆన్సర్ కీ లో తప్పులు
సీయూఈటీ యూజీ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఎన్టీఏ మరో రెండు రోజుల్లో విడుదల చేయనుంది. జులై 17 లోపు ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. ఫలితాలు వెల్లడైన తరువాత విద్యార్థులు తమ రిజల్ట్ ను cuet.samarth.ac.in. వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. సీయూఈటీ యూజీ 2023 పరీక్షలు మే 21 నుంచి జూన్ 23 వరకు జరిగాయి. జూన్ 29వ తేదీన మొదట ప్రొవిజనల్ ఆన్సర్ కీ ని ఎన్టీఏ విడుదల చేసింది. కానీ ఆ ఆన్సర్ కీలో చాలా తప్పులున్నాయని విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఆ ప్రొవిజనల్ ఆన్సర్ కీని వెనక్కు తీసుకుంది. ఆ తరువాత మళ్లీ జులై 3 వ తేదీన ప్రొవిజనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది.
check CUET UG Result 2023: రిజల్ట్ చెక్ చేసుకోవడం ఎలా?
ఈ సంవత్సరం సీయూఈటీ యూజీ పరీక్షకు సుమారు 14 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 6.52 లక్షల మంది బాలికలు కాగా, 7.48 లక్షల మంది బాలురు. కాగా, జులై 15 వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడుతాయని మొదట ప్రకటించారు. కానీ తాజాగా, జులై 17 లోపు ఫలితాలను విడుదల చేస్తారని యూజీసీ ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షలను రాసిన విద్యార్థులు కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు. అవి..
- ముందుగా అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీపై కనిపించే "CUET UG 2023 result" లింక్ పై క్లిక్ చేయాలి.
- పుట్టిన రోజు, రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేసి, లాగిన్ కావాలి.
- స్క్రీన్ పై CUET UG 2023 result లిస్ట్ కనిపిస్తుంది.
- విద్యార్థి తన రిజల్ట్ ను చెక్ చేసుకుని, ఆ రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింటౌట్ తీసి భద్రపర్చుకోవాలి.