Crocodile in IIT campus: ఐఐటీ క్యాంపస్ లో భారీ మొసలి చక్కర్లు; భయాందోళనల్లో విద్యార్థులు-crocodile spotted casually roaming inside iit bombay campus internet stunned ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crocodile In Iit Campus: ఐఐటీ క్యాంపస్ లో భారీ మొసలి చక్కర్లు; భయాందోళనల్లో విద్యార్థులు

Crocodile in IIT campus: ఐఐటీ క్యాంపస్ లో భారీ మొసలి చక్కర్లు; భయాందోళనల్లో విద్యార్థులు

Sudarshan V HT Telugu

Crocodile in IIT campus: ఐఐటీ బాంబేలోని పొవాయ్ క్యాంపస్ లో ఓ భారీ మొసలి కనిపించింది. క్యాంపస్ లో సరస్సు పక్కన రోడ్డుపై సంచరిస్తున్న భారీ మొసలిని చూసి, విద్యార్థులు, వీక్షకులు దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురయ్యారు.

ఐఐటీ క్యాంపస్ లో భారీ మొసలి చక్కర్లు (X/@anand_ingle89)

Crocodile in IIT campus: ఐఐటీ బాంబేలోని పొవాయ్ క్యాంపస్ లో సరస్సు పక్కన రోడ్డుపై సంచరిస్తున్న భారీ మొసలి వీక్షకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పొవాయ్ సరస్సు నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తున్న ఈ భారీ మొసలి ఆదివారం రాత్రి సమీపంలోని రోడ్డుపై విశ్రాంతి తీసుకుంటూ కనిపించిందని జంతు రక్షకుడు ఒకరు మీడియాకు తెలిపారు.

సరస్సు నుంచి బయటకు వచ్చి..

మొసళ్లు సాధారణంగా సరస్సుకే పరిమితమై, మనుషులు నివసించే ప్రాంతాలకు దూరంగా ఉంటాయని, ఇలాంటి ఘటన చాలా అరుదుగా జరుగుతుందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు.

గుడ్లు పెట్టడానికా?

ఈ మొసలి గుడ్లు పెట్టడానికి గూడు కట్టే ప్రదేశం కోసం వెతుకుతున్న ఆడ మొసలి అయి ఉండవచ్చని రెస్కింక్ అసోసియేషన్ ఫర్ వైల్డ్ లైఫ్ వెల్ఫేర్ (ఆర్ఏడబ్ల్యూ) వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, గౌరవ వైల్డ్లైఫ్ వార్డెన్ పవన్ శర్మ అన్నారు. స్థానికులు, అధికారులు సరీసృపానికి ఎలాంటి హాని జరగకుండా చూసుకున్నారు. అది తనంతట తానుగా సరస్సులోకి వెళ్లి పోయిందని శర్మ తెలిపారు. మరోవైపు థానే టెరిటోరియల్ వింగ్ ముంబై రేంజ్ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, అప్రమత్తంగా ఉండాలని, మొసళ్లు తరచూ కనిపించే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు.

గతంలో ములుంద్ లో ఇలాంటి దృశ్యం

ముంబైలో మొసలి మానవ ఆవాసాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి కాదు. మరో ఘటనలో ములుంద్ లోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో కూడా ఒక మొసలి కనిపించింది. ా తొమ్మిది అడుగుల పొడవైన మొసలిని ఆ తరువాత రక్షించారు. నిర్మల్ లైఫ్ స్టైల్ హౌసింగ్ సొసైటీలో ఆదివారం ఉదయం సరీసృపం కనిపించిందని వన్యప్రాణి సంక్షేమ బృందం తెలిపింది. ఆర్ఏడబ్ల్యూ సభ్యులు, అటవీశాఖ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం 6:30 గంటలకు ఆడ ఇండియన్ మార్ష్ మొసలిని సురక్షితంగా రక్షించినట్లు శర్మ పేర్కొన్నారు. ఆర్ఏడబ్ల్యూతో సంబంధం ఉన్న పశువైద్యులు డాక్టర్ ప్రీతి సాథే, డాక్టర్ కీర్తి సాథే వైద్య పరీక్షల అనంతరం మొసలి ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించి తిరిగి దాని సహజ ఆవాసంలోకి విడిచిపెట్టారు.

ఆ క్లిప్ ఇక్కడ చూడండి

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.