భర్తతో ఆసుపత్రి నుంచి వస్తుండగా అంబులెన్స్‌లో మహిళకు లైంగిక వేధింపులు-crime news women molested in ambulance patient husband thrown off vehicle dies in uttar pradesh ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భర్తతో ఆసుపత్రి నుంచి వస్తుండగా అంబులెన్స్‌లో మహిళకు లైంగిక వేధింపులు

భర్తతో ఆసుపత్రి నుంచి వస్తుండగా అంబులెన్స్‌లో మహిళకు లైంగిక వేధింపులు

Anand Sai HT Telugu
Sep 05, 2024 02:39 PM IST

Crime News : భర్తను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఓ మహిళను అంబులెన్స్ డ్రైవర్‌తోపాటు సహాయకుడు వేధించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న భర్తను ఆసుపత్రి నుంచి భార్య ఇంటికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ డ్రైవర్ వేధించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. లక్నోలోని ఘాజీపూర్ ప్రాంతానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్, అతని సహాయకుడు ఒక రోగిని సిద్ధార్థ్ నగర్ జిల్లాకు తీసుకువెళుతుండగా మహిళను లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె భర్తను వాహనం నుండి కిందకు తోసేశారు. కింద పడిపోవడం వల్ల అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇతర సమస్యలతోపాటుగా గాయాలు అతని మరణానికి కారణమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దంపతులు సిద్ధార్థ్ నగర్ జిల్లాకు చెందినవారు. బాధితురాలి భర్త లక్నోలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే చికిత్స ఖర్చులు భరించలేని కారణంగా ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆసుపత్రిలో కేవలం 2 రోజుల చికిత్సకు లక్షకు పైగా అయింది. డబ్బులు అయిపోతున్నాయని, తన భర్తను డిశ్చార్జ్ చేయాలని డాక్టర్‌ను కోరింది బాధితురాలు. వైద్యుడు సరే అనడంతో అంబులెన్స్‌ను బుక్ చేసుకున్నారు.

బాధితురాలి భర్త, ఆమె సోదరుడు అంబులెన్స్‌లో వెనకవైపు ఉన్నారు. బాధితురాలిని ముందు కూర్చొబెట్టారు. మార్గమధ్యంలో డ్రైవర్‌తోపాటుగా సహాయకుడు వేధింపులకు పాల్పడడం మెుదలుపెట్టారు. అంబులెన్స్ ఆసుపత్రి నుంచి 150 కి.మీ ప్రయాణించి ఓ ప్రదేశంలో ఆగింది. ఆ తర్వాత డ్రైవర్, సహాయకుడు ఆమెను వేధించడం ప్రారంభించారు.

'నా సోదరుడు నా భర్తతో పాటు వెనుక కూర్చున్నాడు. నేను ముందు సీట్లో కూర్చోవలసి వచ్చింది. కొంత సమయం తర్వాత, డ్రైవర్, అతని సహచరుడు నన్ను తాకడం ప్రారంభించారు. వారి చర్యపై నేను చాలాసార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు. కొంతసేపటికి అనారోగ్యంతో ఉన్న నా భర్త, సోదరుడు నా పరిస్థితిని చూసి వేధింపుల గురించి అరిచారు. రాత్రి 11:30 గంటలకు డ్రైవర్, సహచరుడు నా భర్త ఆక్సిజన్ సిలిండర్ మాస్క్‌ను తీసివేసి వాహనం నుండి తోసేశారు. నా సోదరుడిపై కూడా దాడి జరిగింది' అని బాధితురాలు తెలిపింది.

వారిని కిందకు దించేసిన నిందితులు ఆమె నగలు, పర్సు నుండి రూ. 10,000 దొంగిలించి పారిపోయారు. బాధితురాలు వెంటనే పోలీసులను సంప్రదించింది. స్థానిక పోలీసులు వెంటనే మరొక అంబులెన్స్‌ను పంపారు. అప్పటికి ఆమె భర్త చనిపోయాడు. డ్రైవర్‌, సహాయకుడిపై గాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అదనపు డీసీపీ జితేంద్ర దుబే తెలిపారు.

టాపిక్