ముంబైలో అత్యంత పాశవిక, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. తన 19ఏళ్ల బాయ్‌ఫ్రెండ్, కూతురిని రేప్ చేస్తుండగా ఆమె తల్లి చూస్తూ కూర్చుంది!
ముంబైలోని మాల్వానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది ఈ ఘటన. ఓ 30ఏళ్ల మహిళకు రెండున్నరేళ్ల కూతురు ఉంది. అంతేకాదు, ఆ మహిళ 19ఏళ్ల యువకుడితో ప్రేమలో ఉంది.
ఆదివారం రాత్రి తల్లి, ఆమె ప్రియుడు చిన్నారిని మాల్వానీ జనకల్యాణ్ నగర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తన బిడ్డకు మూర్చ వచ్చిందని, ఆ తర్వాత శ్వాస తీసుకోవడం ఆపేసిందని ఆ తల్లి చెప్పింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్‌పై తీవ్ర గాయాలున్నాయని తేలింది. దీంతో అనుమానం వచ్చి ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆసుపత్రికి చేరుకోగానే చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు మాల్వానీ పోలీసులు తెలిపారు. రెండు- మూడు గంటల తర్వాత రిపోర్టు వచ్చిందని, ఆమెపై అత్యాచారం జరిగిందని, ఊపిరాడక చనిపోయిందని తేలినట్టు వివరించారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు చిన్నారి తల్లిని, ఆమె ప్రియుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి, భారతీయ న్యాయ సంహిత కింద కేసు వేశారు.
ప్రాథమిక విచారణలో కుమార్తెపై బాయ్‌ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పిడన సమయంలో తల్లి గదిలోనే ఉన్నట్లు తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్వానీలో నివసించే మహిళ మూడేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి ఆమె తన తల్లితో కలిసి నివసిస్తుండగా, ఆ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉంటున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతుతున్నాయి.
ముంబైలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళకరంగా మారాయి. ఓ మహిళను ఆమె పొరుగింటి వ్యక్తి రేప్ చేసిన ఘటన నవీ ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 30వ తేదీన ఈ ఘటన జరింది. ఏదో పని నెపంతో నిందితుడు తనను తన ఇంటికి పిలిపించుకుని బలవంతం చేశాడని బేలాపూర్‌కు చెందిన మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎన్ఆర్ఐ సగ్రి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 64 (1), 351 (1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వెల్లడించారు.
సంబంధిత కథనం