Crime news: డ్రగ్స్ ఇచ్చి 12 ఏళ్ల విద్యార్థినిపై క్రికెట్ కోచ్ లైంగిక దాడి
Crime news: తన వద్దకు క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చిన ఒక చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడో కోచ్ ముసుగులోని కీచకుడు. ఆ 12 ఏళ్ల చిన్నారికి మత్తుమందు ఇచ్చి, 2 నెలలుగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడా కీచక కోచ్.
Crime news: తన పర్యవేక్షణలో క్రికెట్ క్రీడను నేర్చుకుంటున్న 12 ఏళ్ల బాలికకు ఒక క్రికెట్ కోచ్ మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న పంకి ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం క్రికెట్ అకాడమీలో పనిచేసిన ఆ కీచక కోచ్ పరారీలో ఉన్నాడు.
మత్తుమందు ఇచ్చి..
గంగాగంజ్ కు చెందిన నిందితుడైన క్రికెట్ కోచ్ కోచింగ్ క్లాసుల అనంతరం ఆ మైనర్ బాలికను తన కాలనీకి తీసుకువచ్చి, ఆమెకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడేవాడు. రెండు నెలల పాటు ఆ బాలికపై ఈ అఘాయిత్యాన్ని కొనసాగించాడు. ఆ బాలిక తన తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆ కోచ్ పై ఆమె పంకీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ఆ బాలికను బ్లాక్ మెయిల్ చేశాడని, ఆమెను బెదిరించడానికి కులపరమైన దూషణలకు పాల్పడ్డాడని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు
నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం, భారతీయ న్యాయ సంహిత (bns) లోని ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారని సెంట్రల్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ విజయేంద్ర ద్వివేది తెలిపారు. ఇటీవల గుజైనీ ప్రాంతంలో ఇదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రముఖ పాఠశాలకు చెందిన సంగీత ఉపాధ్యాయుడు నాలుగేళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.