COVID-19 Update: మళ్లీ కోవిడ్ కలకలం; కేరళలో 292 ఫ్రెష్ కేసులు; ముగ్గురు మృతి; మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2041
COVID-19 Update: కొరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. కేరళలో ఈ వైరస్ బారిన పడి తాజాగా ముగ్గురు మృత్యువాత పడ్డారు.
COVID-19 Update: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 19న కేరళలో 292 కొత్త కోవిడ్-19 (COVID-19 Update) కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ మహమ్మారితో ముగ్గురు చనిపోయారు. ప్రస్తుతం కేరళలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,041 కి చేరింది. కేరళలో కోవిడ్ కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 72,056 కి చేరుకుంది.
సిద్ధంగా ఉన్నాం..
కొరోనా (corona virus)కేసుల సంఖ్య పెరుగుతోందని, అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. కోవిడ్-19 రోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, గదులు, ఆక్సిజన్ బెడ్‌లు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఇండియాలో..
భారతదేశంలో, డిసెంబర్ 20, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 341 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత గత 24 గంటల్లో కోలుకున్న, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 224 కి చేరుకుంది. భారత్ లో ఇప్పటివరకు 68,37,203 మంది కొరోనా వైరస్ బారిన పడ్డారు.