COVID symptoms changed again: కోవిడ్ లక్షణాలు మళ్లీ మారుతున్నాయి; చెక్ చేసుకోండి-covid symptoms changed again the top sign to identify the infection now ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Covid Symptoms Changed Again: The 'Top' Sign To Identify The Infection Now

COVID symptoms changed again: కోవిడ్ లక్షణాలు మళ్లీ మారుతున్నాయి; చెక్ చేసుకోండి

HT Telugu Desk HT Telugu
Jan 04, 2023 03:22 PM IST

ఎప్పటికప్పుడు రూపు మార్చుకుంటున్న కొరోనా వైరస్.. కొత్త వేరియంట్లతో భయపెడుతోంది.

కరోనా వైరస్
కరోనా వైరస్

COVID symptoms changing again: కొరోనా(corona) వైరస్ వల్ల వచ్చే కోవిడ్ 19 లక్షణాలు మొదట్లో ఒకలా ఉంటే, ఇప్పుడు వచ్చిన తాజా వేరియంట్ తో మరోలా ఉంటున్నాయి. వైరస్ వేరియంట్లలో మార్పుతో వ్యాధి లక్షణాల్లోనూ మార్పు వస్తోంది. అదృష్టం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్లు ఏవీ కూడా అంతగా ప్రాణాంతకం కాకపోవడమే.

ట్రెండింగ్ వార్తలు

COVID symptoms changing again: మొదట్లో..

మొదట్లో కోవిడ్ సోకినవారికి ప్రధానంగా కనిపించిన లక్షణాలు తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు. రుచి వాసన కోల్పోవడం మొదలైనవి. ఆ తరువాత వైరస్ ల మ్యుటేషన్, వ్యాక్సినేషన్ వల్ల లక్షణాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు, గొంతులో ఇబ్బంది, జలుబు, ముక్కు కారుతుండడం, అలసట, స్వల్ప స్థాయి జ్వరం మొదలైన లక్షణాలు కనిపించడం ప్రారంభమైంది.

myalgia: ఇప్పుడు మయాల్జియా

తాజాగా, మళ్లీ కోవిడ్ లక్షణాల్లో మార్పు కనిపిస్తోంది. కొత్త లక్షణాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ 19 పేషెంట్లలో మయాల్జియా(myalgia) సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. మయాల్జియా (myalgia) లో ప్రదానంగా భుజాలు, కాళ్లు భాగంలోని కండరాల్లో భరించలేనంత తీవ్రమైన నొప్పి ఉంటుంది. శరీరంలో ప్రవేశించిన వైరస్ ను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక కణాలు విడుదల చేసే మాలిక్యూల్స్ వల్ల ఈ నొప్పి వస్తుందని పరిశోధకులు తేల్చారు. కోవిడ్ యాప్ ప్రకారం, ప్రస్తుతం కోవిడ్ పేషెంట్లలో కనిపిస్తున్న ప్రధాన లక్షణం ఈ మయాల్జియా (myalgia) . టీకా తీసుకున్న వారిలో ఈ లక్షణాలు స్వల్పంగా, టీకా తీసుకోని వారిలో ఈ లక్షణాలు ప్రబలంగా కనిపిస్తున్నాయని డాక్టర్ ఆంజిలిక్ కోయెట్జీ వెల్లడించారు. ఈ మయాల్జియా (myalgia) తో వచ్చే కండరాల నొప్పి వల్ల దైనందిన కార్యకలాపాలు కూడా చేసుకోలేక పోతారు. ఈ లక్షణం వైరస్ శరీరంలో ప్రవేశించిన ఒకటి, రెండు రోజుల్లోనే కనిపిస్తుంది. అందువల్ల, ఈ లక్షణం కనిపించగానే, కోవిడ్ టెస్ చేసుకోవడం ఉత్తమం.

IPL_Entry_Point

టాపిక్