UK flight: అత్యుత్సాహంతో విమానం టాయిలెట్లో జంట శృంగారం; చివరకు..-couple caught having sex in toilet on uk flight escorted off plane ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uk Flight: అత్యుత్సాహంతో విమానం టాయిలెట్లో జంట శృంగారం; చివరకు..

UK flight: అత్యుత్సాహంతో విమానం టాయిలెట్లో జంట శృంగారం; చివరకు..

HT Telugu Desk HT Telugu
Sep 13, 2023 04:23 PM IST

UK flight: ఆకాశంలో విమానం ప్రయాణిస్తూ ఉండగా, ఫ్లైట్ టాయిలెట్లో ఒక జంట శృంగారంలో పాల్గొంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఈ వీడియో ట్విటర్ లో 50 లక్షల సార్లకు పైగా షేర్ అయింది.

విమానంలో దృశ్యం (స్క్రీన్ షాట్)
విమానంలో దృశ్యం (స్క్రీన్ షాట్)

UK flight: విమానంలో వింత వింత ఘటనలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. సహ ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం, ప్రయాణికులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం.. వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కానీ, యూకేలో ఒక విమానంలో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం చాలా అరుదైనదిగా భావించవచ్చు.

టాయిలెట్లో శృంగారం..

సెప్టెంబర్ 8వ తేదీన యూకేలోని ఈజీ జెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్ లో ఒక జంట అత్యుత్సాహంతో విమానంలోని టాయిలెట్లోనే శృంగారం చేయడం ప్రారంభించారు. విమాన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఒక ఫ్లైట్ అటెండెంట్ టాయిలెట్ డోర్ తీయగానే.. ఆ జంట నగ్నంగా శృంగారం చేస్తూ కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గమ్యస్థానం చేరగానే ఆ జంటను విమానం సిబ్బంది పోలీసులకు అప్పగించారు. నెటిజన్లు రకరకాల కామెంట్లతో దీనిపై స్పందిస్తున్నారు. ఈ వీడియో ట్విటర్ లో దాదాపు 50 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. ఒక ఫ్లైట్ అటెండెంట్ విమానంలోని టాయిలెట్ డోర్ తీయడం, టాయిలెట్ లోపల నగ్నంగా ఆ జంట ఉండడం ఆ వీడియోలో కనిపిస్తుంది.

నెటిజన్ల స్పందన..

కమాన్ అనే కామెంట్స్, క్యాబిన్ లో నుంచి నవ్వులు ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. అనంతరం, ఆ క్యాబిన్ లోని అందరూ గట్టిగా నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపిస్తారు. యూకేలోని ల్యూటన్ నుంచి ఇబాజాకు ఈ విమానం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఈజీ జెట్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. విమానం ఇబాజాకు చేరుకున్న తరువాత ఆ జంటను పోలీసులకు అప్పగించామన్నారు. అయితే, ఆ జంటపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు. యూకే చట్టాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్లలో లైంగిక చర్యలకు పాల్పడడం నేరం. అయితే, విమానంలోని టాయిలెట్ల పబ్లిక్ టాయిలెట్ల కిందకు వస్తాయా? రావా? అనే విషయంలో స్పష్టమైన వివరాలు ఏ చట్టంలోనూ లేవని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.