UP serial killer : ఎట్టకేలకు దొరికిన సీరియల్​ కిల్లర్​- 13 నెలల్లో 9 మంది మహిళలను..-cops nab up serial killer kuldeep kumar gangwar after deaths of nine women in 13 months ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Serial Killer : ఎట్టకేలకు దొరికిన సీరియల్​ కిల్లర్​- 13 నెలల్లో 9 మంది మహిళలను..

UP serial killer : ఎట్టకేలకు దొరికిన సీరియల్​ కిల్లర్​- 13 నెలల్లో 9 మంది మహిళలను..

Sharath Chitturi HT Telugu
Aug 10, 2024 08:50 AM IST

Kuldeep Kumar Gangwar : యూపీ సీరియల్​ కిల్లర్​ని పోలీసులు అరెస్ట్​ చేశార. 13 నెలల్లో 9 మంది మహిళలను అతను చంపేశాడు.

యూపీ సీరియల్​ కిల్లర్​..
యూపీ సీరియల్​ కిల్లర్​..

ఉత్తర్​ ప్రదేశ్​లో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హత్య చేసిన సీరియల్​ కిల్లర్​ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతడిని పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ ​'తలాష్​' విజయవంతమైనందని పోలీసులు తెలిపారు. అతడి పేరుతో పాటు మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు.

యూపీ సీరియల్​ కిల్లర్​ అరెస్ట్​..

యూపీ సీరియల్​ కిల్లర్​ పేరు కుల్దీప్​ కుమార్​ గంగ్వార్​. అతడి వయస్సు 38ఏళ్లు. బరేలీ ప్రాంతంలో 13 నెలల వ్యవధిలో 9మంది మహిళలను హతమార్చాడు. పొలాల్లో ఒంరిగా పనిచేస్తున్న మహిళలే అతని టార్గెట్​. అటవీ ప్రాంతాల్లోని మహిళలను కూడా అతని విడిచిపెట్టలేదు.

జులై​ 2023- జులై 2024లో మధ్యలో బరేలీకి సమీపంలోని గ్రామాల్లో మహిళలను ఈ సీరియల్​ కిల్లర్​ చంపాడు. ఒంటరిగా కనపడిన మహిళల దగ్గరికి వెళ్లడం, లైంగికంగా వారికి దగ్గరవ్వడానికి ప్రయత్నించడం, ఒప్పుకోకపోతే.. తీవ్రస్థాయిలో కోపం తెచ్చుకుని, వారిని గొంతు నులిమి చంపడం ఈ సీరియల్​ కిల్లర్​కి అలవాటు. అనంతరం మహిళల లిప్​స్టిక్​లు, బిందీలు, ఐడీ కార్డులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఆపరేషన్​ తలాష్​..

13 నెలల్లో 9 హత్యలు చేసి, పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న కుల్దీప్​ని పట్టుకునేందుకు ఆపరేషన్​ తలాష్​ని చేపట్టారు. ఇందులో భాగంగా జులైలో పోలీసులకు ఒక టిప్​ వచ్చింది. దానిపై వారు వెంటనే స్పందించారు. షాహి, శీష్​గఢ్​ పోలీస్​ స్టేషన్ల మధ్యలో 25 కి.మీల రేడియస్​ని మార్క్​ చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

"యూపీ సీరియల్​ కిల్లర్​ని పట్టుకునేందుకు 22 బృందాలను ఏర్పాటు చేశాము. 1,50,000 అనుమానాస్పద మొబైల్​ నెంబర్లను స్కాన్​ చేశాము. 1,500 సీసీటీవీ కెమెరాలను మానిటర్​ చేశాము. క్రైమ్​ ప్యాటర్న్​ని దర్యాప్తు చేశాము," అని బరేలీ ఎస్​ఎస్​పీ అనురాగ్​ ఆర్య తెలిపారు.

జులై 2న భౌజియా జాగీర్​ అనే గ్రామంలో అనితా దేవీ అని మహిళను కుల్దీప్​ కుమార్​ హత్య చేశాడు. ఆమె గొంతు నులిమి హతమార్చాడు. కొందరు మనుషులు ఆ ఘటనను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంలో స్కెచ్​లు, వీడియోలు రూపొందించారు. స్థానిక పోలీస్​ స్టేషన్లకు పంపించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు చివరికి గురువారం కుల్దీప్​ని అరెస్ట్​ చేశారు.

నిందితుడిని అరెస్ట్​ చేసి విచారించగా.. ఆరు నేరాలను అతడు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మరో మూడు హత్యలు కూడా అతడే చేసినట్టు ఆధారాలు ఉన్నాయని వివరించారు. ఈ కేసులో సైకియాట్రిస్ట్​ని సంప్రదిస్తున్నట్టు తెలిపారు.

కాగా అతని బాల్యంలో జరిగిన పలు సంఘటనలు అతడి మానసిక సమస్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. తల్లి బతికుండగానే తండ్రి వేరే మహిళను పెళ్లి చేసుకోవడం కుల్దీప్​ కుమార్​ చూశాడు. ఫలితంగా ఇంట్లో జరిగిన గృహ హింస, కుల్దీప్​ని అత్యంత ప్రభావితం చేసింది.

"సవతి తల్లిపై కుల్దీప్​ కోపం పెంచుకున్నాడు. అందరు మహిళలను అలాగే చూడటం మొదలుపెట్టాడు," అని పోలీసులు వెల్లడించారు.

మొదటి హత్య గతేడాది జులైలో జరిగింది. చివరి హత్య ఈ ఏడాది జులైలో జరిగింది.

సంబంధిత కథనం