Congress presidential polls : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక​ పూర్తి- ఫలితాలు ఎప్పుడంటే..!-congress presidential polls voting ends in kharge vs tharoor contest ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Congress Presidential Polls: Voting Ends In Kharge Vs Tharoor Contest

Congress presidential polls : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక​ పూర్తి- ఫలితాలు ఎప్పుడంటే..!

Sharath Chitturi HT Telugu
Oct 17, 2022 05:02 PM IST

Congress presidential polls : సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక ఓటింగ్​ ప్రక్రియ.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సోనియా, ప్రియాంక గాంధీలతో పాటు అనేక మంది కాంగ్రెస్​ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్​ పూర్తి- ఫలితాలు ఎప్పుడంటే..!
ఓటింగ్​ పూర్తి- ఫలితాలు ఎప్పుడంటే..! (AFP)

Congress presidential polls : కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్​ ముగిసింది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు.. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయాల్లో.. 9వేల మంది ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శశి థరూర్​, మల్లిఖార్జున ఖర్గేలో ఒకరు.. అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఓటేసిన ప్రముఖులు..

దేశవ్యాప్తంగా.. సోమవారం ఉదయం 10 గంటలకు ఓటింగ్​ ప్రారంభమైంది. ఫలితంగా దాదాపు అన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయాలు కిటకిటలాడిపోయాయి. ఢిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి ఓటేశారు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ రోజు కోసం చాలా కాలంగా ఎదురుచుస్తున్నట్టు వెల్లడించారు.

<p>ఢిల్లీలో ఓటేసిన సోనియా గాంధీ</p>
ఢిల్లీలో ఓటేసిన సోనియా గాంధీ

Congress presidential election ends : అనంతరం.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​. పీ. చిదంబర్​ సైతం ఓటు వేశారు.

ప్రస్తుతం భారత్​ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. మరో 40మందితో కలిసి కర్ణాటక బళ్లారిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంప్​సైట్​లో తన ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది.

<p>ప్రియాంక గాంధీ</p>
ప్రియాంక గాంధీ

గెలుపెవరిది?

Kharge vs Shashi Tharoor : తాజా ఎన్నిక రహస్య బ్యాలెట్​ పద్ధతిలో జరిగింది. మంగళవారం సాయంత్రం నాటికి.. అన్ని బ్యాలెట్​ బాక్సులు.. ఢిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటాయి. బుధవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి.

ఖర్గేకు గాంధీల మద్దతు ఉందని సర్వత్రా ప్రచారాలు జరిగాయి. అయితే గెలుపుపై చాలా ధీమాగా ఉన్నట్టు శశి థరూర్​ వెల్లడించారు. గాంధీలు తటస్థంగా ఉన్నట్టు, బహిరంగంగా ఎవరికీ మద్దతు ఇవ్వలేదని అభ్యర్థులిద్దరు చెప్పారు.

<p>మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​</p>
మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​

వీళిద్దరిలో ఎవరు గెలిచినా.. 20ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతరు కాంగ్రెస్​ సభ్యుడు.. పార్టీ అధ్యక్ష పదవి చేపడుతున్నట్టు అవుతుంది. కొత్తగా బాధ్యత స్వీకరించే వ్యక్తిపై చాలా అంచనాలు ఉన్నాయి. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ఆయనపైనే ఉండనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం