Congress president election : రేపే కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక.. గెలుపెవరిది?-congress all set to vote for its presidential elections tomorrow ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Congress All Set To Vote For Its Presidential Elections Tomorrow

Congress president election : రేపే కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక.. గెలుపెవరిది?

Sharath Chitturi HT Telugu
Oct 16, 2022 08:31 PM IST

Congress president election : సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రేపే కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక
రేపే కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక (ANI)

Congress president election : దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారిన కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్​ జరగనుంది. శశి థరూర్​, మల్లిఖార్జున ఖర్గే మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఫలితంగా 24ఏళ్ల తర్వాత.. గాంధీయేతరులు ఆ బాధ్యత తీసుకుంటున్నట్టు అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు

సీక్రెట్​ బ్యాలెట్​..

సోమవారం ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక​ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు పోలింగ్​ ముగుస్తుంది. పోలింగ్​ కోసం కాంగ్రెస్​ సెంట్రల్​ ఎలక్షన్​ అథారిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్​ బ్యాక్సులు ఇప్పటికే అన్ని రాష్ట్రాల కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయాలకు చేరుకున్నాయి.

<p>ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు</p>
ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు

మొత్తం మీద ఎలక్టోరల్​ కాలేజీకి చెందిన 9వేల మంది ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ సభ్యులు.. తదుపరి కాంగ్రెస్​ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. సీక్రెట్​ బ్యాలెట్​ పద్ధతిలో ఈ ఎన్నిక జరగనుంది. సభ్యులు.. తమకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ‘టిక్’​ మార్క్​ పెట్టాల్సి ఉంటుంది.

Congress president election polling : కాంగ్రెస్​ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​.. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయనున్నారు. థరూర్​, ఖర్గేలు తమ తమ రాష్ట్రాల్లోని(త్రివేండ్రం- బెంగళూరు) కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ప్రస్తుతం భారత్​ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్​ గాంధీతో పాటు మరో 40 మంది కాంగ్రెస్​ సభ్యులు.. కర్ణాటక బళ్లారి జిల్లాలోని క్యాంప్​ సైట్​లో ఓట్లు వేయనున్నారు. ఇందుకు సంబంధించి అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

పోలింగ్​ ముగిసిన తర్వాత బ్యాలెట్​ బాక్సులన్నీ మంగళవారం నాటికి ఢిల్లీ చేరుకుంటాయి. 19వ తేదీన.. ఢిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఆరోజే.. కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక విజేతను ప్రకటిస్తారు.

ఈ ఎన్నిక చాలా కీలకం..

Rahul Gandhi : దేశ రాజకీయాల్లో కాంగ్రెస్​ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. పోటీ పడిన దాదాపు అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. ఇక కాంగ్రెస్​లోని అంతర్గత కలహాలు నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటాయి. సీనియర్లు పార్టీని విడిచివెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికకు ప్రాధాన్యత సంతరించుకుంది.

రాహుల్​ గాంధీ.. కాంగ్రెస్​ అధ్యక్షుడిగా పోటీ చేయాలని పార్టీ నుంచి తీవ్ర డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ ఆయన పోటీ చేయలేదు. సోనియా గాంధీ వయస్సు రిత్యా.. మరో వ్యక్తిని కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల ఇప్పుడు అందరి కళ్లు శశి థరూర్​, మల్లిఖార్జున ఖర్గేవైపే ఉన్నాయి. వీరిలో గెలిచిన వ్యక్తి.. కాంగ్రెస్​ను మళ్లీ పునర్వైభవం తీసుకొస్తారని పార్టీ శ్రేణులు కోటి ఆశలు పెట్టుకున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం