excise policy case:‘‘ లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడికి వెళ్లిందో రేపు కేజ్రీవాల్ కోర్టులో చెబుతారు’’- సునీత కేజ్రీవాల్-cm will make big expose on excise policy case in court tomorrow sunita kejriwal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cm Will Make Big Expose On Excise Policy Case In Court Tomorrow: Sunita Kejriwal

excise policy case:‘‘ లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడికి వెళ్లిందో రేపు కేజ్రీవాల్ కోర్టులో చెబుతారు’’- సునీత కేజ్రీవాల్

HT Telugu Desk HT Telugu
Mar 27, 2024 03:32 PM IST

లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బు ఎక్కడికి చేరిందో రేపు కోర్టులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడిస్తారని ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం సంచలన ప్రకటన చేశారు.2021-22 ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్

ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టు ముందు సంచలన విషయాలను వెల్లడించనున్నారని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ (Sunita Kejriwal) ప్రకటించారు. ఆ స్కామ్ కు సంబంధించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో తెలిపే ఆధారాలను కూడా కోర్టుకు సమర్పిస్తారని ఆమె చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి

2021-22 ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి, కీలక కుట్రదారు అరవింద్ కేజ్రీవాలేనని ఈడీ (Enforcement Directorate) ఆరోపిస్తోంది. కోర్టు ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి అప్పగించింది. గురువారం మరోసారి కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచనున్నారు.

సునీత సంచలన ప్రకటన

కాగా, కేజ్రీవాల్ గురువారం కోర్టులో పలు సంచలన విషయాలను వెల్లడించనున్నారని ఆయన భార్య సునీత తెలిపారు. ఆమె బుధవారం సీఎం నివాసం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తాను మంగళవారం సాయంత్రం జైలులో తన భర్తను కలిశానని ఆమె చెప్పారు. ‘‘నిన్న సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ ను కలవడానికి వెళ్లాను. అతనికి డయాబెటిస్ ఉంది. అతని షుగర్ లెవెల్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కానీ అతని సంకల్పం బలంగా ఉంది. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న నీరు, మురుగునీటి సమస్యలను పరిష్కరించాలని రెండు రోజుల క్రితం ఆయన జలవనరుల శాఖ మంత్రి అతిషికి సందేశం పంపారు. ఆయన చేసిన తప్పేంటో చెప్పండి? ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నదే ఆయన చేసిన తప్పా? దీనిపై కేంద్ర ప్రభుత్వం మీ సీఎంపై కేసు పెట్టింది. ఢిల్లీని సర్వనాశనం చేయాలనుకుంటున్నారా? ప్రజలు తమ సమస్యలతో సతమతమవుతూనే ఉండాలని వారు కోరుకుంటున్నారా?’’ అని సునీత కేజ్రీవాల్ ఒక వీడియోను విడుదల చేశారు.

ఈడీ దాడుల్లో ఏం తేలింది?

‘‘ఆయన (కేజ్రీవాల్) మరో విషయం చెప్పారు. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన డబ్బు కోసం ఈడీ 250కి పైగా దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు ఏ దాడుల్లోనూ ఒక్క రూపాయి కూడా దొరకలేదు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్ లపై దాడులు నిర్వహించినా ఒక్క రూపాయి కూడా దొరకలేదు. మా ఇంట్లో (సీఎం నివాసం) సోదాలు నిర్వహించినా రూ.73 వేలు మాత్రమే దొరికాయి. కుంభకోణం అని పిలువబడే డబ్బు ఎక్కడికి పోయింది? ఈ నెల 28న కోర్టు ముందు ఈ విషయాన్ని బయటపెడతానని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు’’ అని సునీత తెలిపారు.

పురోగామి శక్తులతో కలిసి పని చేయండి

కేజ్రీవాల్ అరెస్టు తరువాత మార్చి 23న తన మొదటి మీడియా సమావేశంలో సునీత తన భర్త నుండి వచ్చిన ఒక భావోద్వేగ సందేశాన్ని చదివి వినిపించారు, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకునే శక్తులతో జతకట్టాలని ఆయన ప్రజలను కోరారు. భారతదేశాన్ని బలహీనపరచడానికి అనేక అంతర్గత, బాహ్య శక్తులు పనిచేస్తున్నాయి అని ఆ సందేశంలో కేజ్రీవాల్ హెచ్చరించారు.

జైల్ నుంచే పరిపాలన

నగరంలో నీరు, మురుగునీటి సంబంధిత సమస్యలను పరిష్కరించాలని, రాబోయే వేసవిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి అతిషిని ఆదేశిస్తూ ఈడీ కస్టడీ లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు రోజుల ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో కేజ్రీవాల్ తన భార్య, వ్యక్తిగత కార్యదర్శిని ప్రతిరోజూ అరగంట పాటు, న్యాయవాదులను మరో అరగంట పాటు కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 22న అనుమతించింది. ఈ విషయం తెలిసిన వారు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజూ సీఎం సతీమణి, వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఆయన న్యాయవాదులు నిర్ణీత సమయంలో ఆయనను కలుస్తుంటారు.

సీఎం కేజ్రీవాలే..

మద్యం కుంభకోణం రాజకీయ కుట్ర కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని, దోషిగా తేలితే తప్ప ప్రస్తుతం ఉన్న ఏ చట్టమూ ఆయనను జైలు నుంచి సీఎం పదవిలో కొనసాగకుండా అడ్డుకోలేదని ఆప్ మంత్రులు స్పష్టం చేశారు. ఆప్ మద్దతుదారులకు భావోద్వేగ విజ్ఞప్తి చేసిన సునీత, అరవింద్ చాలా నిజాయితీపరుడు, దేశభక్తి కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన శరీరం జైల్లో ఉంది కానీ, కానీ ఆయన ఆత్మ ప్రజల మధ్యే ఉందని సునీత వ్యాఖ్యానించారు.

WhatsApp channel