CLAT 2024 registration: క్లాట్ 2024 కు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్-clat 2024 registration ends today apply at consortiumofnlusacin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Clat 2024 Registration: క్లాట్ 2024 కు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్

CLAT 2024 registration: క్లాట్ 2024 కు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu
Nov 03, 2023 11:43 AM IST

CLAT 2024 registration: ప్రఖ్యాత న్యాయ విద్యా కళాశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష క్లాట్ 2024 (CLAT 2024) కి అప్లై చేయడానికి నవంబర్ 3వ తేదీ లాస్ట్ డేట్. ఇంకా అప్లై చేయని అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

CLAT 2024 registration: 2024 సంవత్సరం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT 2024) కు అప్లై చేయాలనుకునే విద్యార్థులకు ఈ రోజు వరకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అప్లై చేయని ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ లో అధికారిక వెబ్ సైట్ consortiumofnlus.ac.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. క్లాట్ 2024 కు అప్లై చేసే అవకాశం జులై 1 నుంచి ప్రారంభమైంది. నవంబర్ 3 వ తేదీతో ముగుస్తుంది.

ఇతర వివరాలు..

దేశవ్యాప్తంగా ఉన్న 22 నేషనల్ లా యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (UG) , పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో ప్రవేశానికి ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) ను నిర్వహిస్తారు. ఈ క్లాట్ 2024 పరీక్షను 2023 డిసెంబర్ 3 వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అప్లై చేసే విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్ కేటగిరీల వారు రూ. 3,500 లను పరీక్ష ఫీజుగా చెల్లించాలి. ఇతరులు రూ. 4 వేలను చెల్లించాలి. పరీక్ష ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది.

How to apply: ఇలా అప్లై చేయండి..

  • క్లాట్ 2024 కు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
  • ముందుగా అధికారిక వెబ్ సైట్ consortiumofnlus.ac.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే CLAT 2024 registration లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఆ తరువాత స్క్రీన్ పై కనిపించే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని సాఫ్ట్ కాపీని, హార్డ్ కాపీని భద్రపర్చుకోవాలి.
  • Direct link to apply for CLAT 2024