CLAT 2024 answer key: క్లాట్ 2024 ఆన్సర్ కీ విడుదల; ఆబ్జెక్షన్స్ కు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?-clat 2024 answer key released online check objection deadline and how to download pdf ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Clat 2024 Answer Key: క్లాట్ 2024 ఆన్సర్ కీ విడుదల; ఆబ్జెక్షన్స్ కు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

CLAT 2024 answer key: క్లాట్ 2024 ఆన్సర్ కీ విడుదల; ఆబ్జెక్షన్స్ కు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
Dec 05, 2023 09:41 PM IST

CLAT 2024 answer key: క్లాట్ 2024 ఆన్సర్ కీ ని విడుదల చేశారు. క్లాట్ 2024 పరీక్ష రాసిన విద్యార్థులు ఆన్ లైన్ లో consortiumofnlus.ac.in. వెబ్ సైట్ లో ఆన్సర్ కీ ని చెక్ చేసి, ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

CLAT 2024 answer key: దేశవ్యాప్తంగా ఉన్న న్యాయ కళాశాలల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి క్లాట్ ( Common Law Admission Test CLAT) పరీక్షను నిర్వహిస్తారు. 2024 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం ఈ క్లాట్ పరీక్షను ఈ డిసెంబర్ 3వ తేదీన నిర్వహించారు. డిసెంబర్ 4వ తేదీన consortiumofnlus.ac.in. వెబ్ సైట్ లో ఆన్సర్ కీని విడుదల చేశారు. క్లాట్ పరీక్షను కన్సార్షియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (Consortium of National Law Universities NLU) నిర్వహిస్తుంది.

క్లాట్ 2024 ఆన్సర్ కీ

క్లాట్ 2024 ప్రొవిజనల్ ఆన్సర్ కీ (CLAT 2024 answer key) ని ఎన్ఎల్యూ (NLU) మంగళవారం విడుదల చేసింది. ఈ ఆన్సర్ కీ పై విద్యార్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ఎందుకు ఆ ఆన్సర్ తప్పో ప్రూఫ్ తో సహా వివరించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కో ఆబ్జెక్షన్ కు రూ. 1000 లు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల కచ్చితంగా ఆ ఆన్సర్ తప్పు, మీరు రాసిన ఆన్సర్ కరెక్ట్ అని ఆధార సహితంగా తెలిసినట్లైతేనే, ఆబ్జెక్షన్ తెలపండి. ఈ ఆబ్జెక్షన్ విండో డిసెంబర్ 5 ఉదయం 9 గంటల వరకు మాత్రమే ఓపెన్ గా ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందువల్ల, విద్యార్థులు వెంటనే ఆన్సర్ కీని చెక్ చేసుకోవడం మంచిది. ఆబ్జెక్షన్స్ ను పరిశీలించి, ఏవైనా మార్పులు అవసరమని భావిస్తే, ఆ మార్పులు చేసి, ఫైనల్ కీని ప్రకటిస్తారు.

CLAT 2024 answer key: ఇలా చెక్ చేసుకోండి..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ consortiumofnlus.ac.in. ను ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీలో, CLAT 2024 లింక్ ఉంటుంది. ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు, క్రిందికి స్క్రోల్ చేసి, CLAT 2024 ఆన్సర్ కీపై క్లిక్ చేయాలి.
  • రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ మొదలైన మీ ఆధారాలను పూరించాలి.
  • CLAT 2024 ఆన్సర్ కీ పీడీఎఫ్ (PDF) కనిపిస్తుంది.
  • ఆ పీడీఎఫ్ ను ఓపెన్ చేసి, ఆన్సర్స్ ను చెక్ చేసుకోవాలి.

Whats_app_banner