CLAT 2023 result released: క్లాట్ 2023 ఫలితాల వెల్లడి; ముఖ్యమైన డేట్లు ఇవే..
CLAT 2023 results: న్యాయ విద్యకు సంబంధించిన జాతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(Common Law Admission Test) ఫలితాలు విడుదలయ్యాయి.
CLAT 2023 results: నేషనల్ లా యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం క్లాట్(Common Law Admission Test - CLAT)ను నిర్వహిస్తారు. 2023 సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన క్లాట్ పరీక్ష ఫలితాలను consortium of National Law Universities (NLUs) విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ consortiumofnlus.ac.in లో చెక్ చేసుకోవచ్చు.
CLAT 2023 results: ఫిర్యాదులేమైనా ఉంటే..
క్లాట్ పరీక్ష పేపర్, ఆన్సర్ కీ లపై విద్యార్థులకు ఏవైనా ఫిర్యాదులుంటే వాటిని తమ దృష్టికి తీసుకురావడానికి consortium of National Law Universities (NLUs) ఒక అవకాశం కల్పించింది. అందుకు గాన ప్రత్యేకంగా ఫిర్యాదుల పరిష్కార కమిటీ(Grievance Redressal Committee)ని ఏర్పాటు చేసింది. ఫైనల్ ఆన్సర్ కీ పై ఫిర్యాదులను డిసెంబర్ 26 నుంచి డిసెబర్ 29 లోపు అభ్యర్థులు ఆ కమిటీకి పంపించవచ్చు. ఫైనల్ కీ పై ఉన్న అభ్యంతరాలతో పాటు, తాము పరీక్షరాసిన టెస్ట్ సెంటర్ లో పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఫిర్యాదులను కూడా సంబంధిత కమిటీ దృష్టికి తీసుకురావచ్చు.
CLAT 2023 results: ఫిర్యాదు చేయడం ఎలా?
విద్యార్థులు ఫైనల్ ఆన్సర్ కీ పై ఫిర్యాదులు చేయడానికి ఇలా చేయాల్సి ఉంటుంది..
- మొదట విద్యార్థులు consortiumofnlus.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలి.
- మీ వివరాలతో క్లాట్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
- సబ్మిట్ ‘గ్రీవెన్స్’(Submit Grievance) బటన్ ను క్లిక్ చేయాలి.
- మీది ఏ తరహా ఫిర్యాదో తెలపాలి.
- మీ ఫిర్యాదును 100 పదాల్లో వివరించాలి.
- ఫిర్యాదుకు సంబంధించి డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
- డిక్లరేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
- చివరగా సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయాలి.
- ఫిర్యాదులను పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 29.