CISF jawan shoots senior | సీనియర్‌ను కాల్చిచంపిన జవాను
CISF jawan shoots senior | ఒక సీఐఎస్ఎఫ్( CISF) జవాను తన సీనియర్ సహచరుడిని కాల్చిచంపిన ఘటన శనివారం పశ్చిమబెంగాల్‌లో జరిగింది. కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం వద్ద ఒక సీఐఎస్ఎఫ్( CISF) జవాను తనతో పాటు ఉన్న సహచరులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
CISF jawan shoots senior | ఏకే 47తో..
సీఐఎస్ఎఫ్( CISF) హెడ్ కాన్‌స్టేబుల్ ఏకే మిశ్రా శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియం బరాక్స్‌లో ఉన్నాడు. తనతో పాటు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ హోదాలో ఉన్న ఒక సీనియర్ అధికారి, అసిస్టెంట్ కమాండంట్ ర్యాంక్ అధికారి కూడా అక్కడే ఉన్నారు. ఇంతలో, మరో సహచర ఉద్యోగి నుంచి ఒక్కసారిగా ఏకే 47 తుపాకీ లాక్కున్న హెడ్ కాన్‌స్టేబుల్ ఏకే మిశ్రా సహచరులపై కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ హోదాలో ఉన్న ఒక సీనియర్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. అసిస్టెంట్ కమాండంట్ ర్యాంక్ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకుని హుటాహుటిన అక్కడికి వచ్చిన CISF ఐజీ సుధీర్ కుమార్ అభ్యర్థన మేరకు ఏకే మిశ్రా తన గన్‌ను వదిలి లొంగిపోయాడు. కాల్పులకు కారణం ఇంకా తెలియరాలేదు.