CISF Constable Recruitment : సీఐఎస్​ఎఫ్​లో కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ పోస్టులకు నోటిఫికేషన్​-cisf constable recruitment 2022 apply for 787 vacancies of constable tradesman ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cisf Constable Recruitment 2022 Apply For 787 Vacancies Of Constable Tradesman

CISF Constable Recruitment : సీఐఎస్​ఎఫ్​లో కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ పోస్టులకు నోటిఫికేషన్​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 14, 2022 10:25 AM IST

CISF Constable Recruitment 2022 : కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ రిక్రూట్​మెంట్​కు సంబంధించి నోటిఫికేషన్​ను విడుదల చేసింది సీఐఎస్​ఎఫ్​. 787 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

 సీఐఎస్​ఎఫ్​లో కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ పోస్టులకు నోటిఫికేషన్​
సీఐఎస్​ఎఫ్​లో కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ పోస్టులకు నోటిఫికేషన్​ (HT_PRINT)

CISF Constable Recruitment 2022 : 787 కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ పోస్టులకు నోటిఫికేషన్​ను విడుదల చేసింది సీఐఎస్​ఎఫ్​(సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​). సీఐఎస్​ఫ్​లోని కుక్​, బార్బర్​, వాషర్​మాన్​, స్వీపర్​, మేసన్​తో పాటు వివిధ ఉద్యోగాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్​లో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

2022 నవంబర్​ 21 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన లింక్​ వెబ్​సైట్​లో ఉంటుంది. 2022 డిసెంబర్​ 20లోపు అభ్యర్థులు తమ ఆన్​లైన్​ అప్లికేషన్​ను సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్లను ముందే సిద్ధం చేసుకుని పెట్టుకోవాలని నోటిఫికేషన్​ సూచించింది.

సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ రిక్రూట్​మెంట్​ 2022..

  • ఆర్గనైజేషన్​:- సీఐఎస్​ఎఫ్​
  • పోస్టులు:- 787
  • లొకేషన్​:- ప్యాన్​ ఇండియా
  • CISF Constable Recruitment application : పోస్ట్​ పేరు:- కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​
  • అప్లికేషన్​ మోడ్​:- ఆన్​లైన్​
  • చివరి తేదీ:- 2022 డిసెంబర్​ 20
  • వెబ్​సైట్​:- www.cisf.gov.in
  • అప్లికేషన్​ ఫీజు:- యూర్​, ఓపీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ. 100. మహిళలు, ఎస్​సీ/ఎస్​టీ, ఎక్స్​ సర్వీస్​మెన్​ క్యాటగిరీ సభ్యులకు ఎలాంటి అప్లికేషన్​ ఫీజు లేదు.

క్వాలిఫికేషన్​..

ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి.. రాష్ట్ర, కేంద్ర విద్యా బోర్డుల్లో 10వ తరగతి పాస్​ అయ్యి ఉండాలి.

వయస్సు పరిమితి..

CISF Constable Recruitment age limit : సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుల్​ ట్రేడ్స్​మన్​ రిక్రూట్​మెంట్​ కోసం అప్లై చేసుకునే అభ్యర్థి వయస్సు.. 18-23ఏళ్ల మధ్యలో ఉండాలి.

మొత్తం 787 పోస్టుల్లో..

  • కుక్​:- 304
  • కాబ్లర్​:- 6
  • టైలర్​:- 27
  • బార్బర్​:- 102
  • వాషర్​మాన్​:- 118
  • స్వీపర్​:- 199
  • పెయింటర్​:- 1
  • మేసన్​:- 12
  • ప్లంబర్​:- 4
  • మాలి:- 3
  • వెల్డర్​:- 3

*బ్యాక్​లాగ్​ వేకెన్సీల్లో కాబ్లర్​(1), బార్బర్​(7) ఉన్నాయి.

సెలక్షన్​ ప్రక్రియ..

  • పీఎస్​టీ (ఫిజికల్​ స్టాండర్డ్​ టెస్ట్​)
  • పీఈటీ (ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​)
  • డాక్యుమెంటేషన్​
  • ట్రేడ్​ టెస్ట్​
  • రాత పరీక్ష
  • వైద్య పరీక్ష

ITBP Recruitment 2022 : ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ ర్యాంకుతో వివిధ జాబ్స్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ జారీచేసింది. దరఖాస్తుల ప్రక్రియ నవంబరు 23న ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం