China road accident : ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం
China road accident : చైనాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 17మంది మరణించారు. 22మంది గాయపడ్డారు.
China road accident : చైనాలో ఘోర ట్రాఫిక్ ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనాలోని జియాంగ్సీ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22మంది గాయపడ్డారు.
అసలేం జరిగింది..?
"నాన్‌చంగ్ కౌంటీలో శనివారం అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు గల కారణాలు తెలియలేదు. కానీ ఈ ప్రమాదంలో 17మంది మరణించారు. 22మంది గాయాల పాలయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించారు," అని ప్రభుత్వ ఆధారిత మీడియా వెల్లడించింది.
అయితే.. పొగమంచు కారణంగా వెలుతురు లేమితో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Jiangxi road accident : ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. నాన్‌చంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు.. ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని పొగమంచు కప్పేసిందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
"పొగమంచు కారణంగా రోడ్లు కనిపించడం లేదు. విజిబులిటీ తక్కువగా ఉంది. ఫలితంగా ట్రాఫిక్ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నిదానంగా డ్రైవింగ్ చేయాలి. మీ ముందు కారుతో కాస్త గ్యాప్ మెయింటైన్ చేయండి. ఓవర్‌టేకింగ్, లేన్లు మాటిమాటికి మార్చడం వంటి పనులు చేయకండి," అని నాన్‌చంగ్ ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.
China road accident latest updates : చైనాలో రోడ్డు భద్రత అత్యంత దారుణం! అందుకే ఆ దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గత నెలలో పొగమంచు కారణంగా.. ఓ ప్రధాన హైవే మీద 100కుపైగా వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కానీ ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు చాలా కష్టపడ్డారు. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు గంటల తరబడి శ్రమించారు.
China traffic accident today : ఇక గతేడాది సెప్టెంబర్‌లో గుయిజౌ రాష్ట్రంలో ఓ బస్సు తిరగబడి 27మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇండియాలోనూ..
Road accidents in India : ఇండియాలోను రోడ్డు ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి. 2021 సంవత్సరానికి గానూ రోడ్డు ప్రమాదాల వివరాలను ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా -2021’ పేరుతో రూపొందించిన ఒక నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆ సంవత్సరం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల మొత్తంగా 1997 రోడ్డు ప్రమాదాలు జరిగాయిని తెలిపింది. ఈ యాక్సిడెంట్స్ లో మొత్తం 1040 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
మొత్తం మీద.. 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,84,448 మంది గాయాలపాలయ్యారు.
సంబంధిత కథనం