Chef killed: ‘‘వంట రుచిగా లేదని షెఫ్ ను చంపేశారు’’
Chef killed over poor quality of food: ఒక రెస్టారెంట్లో భోజనానికి వచ్చిన నలుగురు వ్యక్తులు.. తమకు వడ్డించిన భోజనం రుచికరంగా లేదని గొడవ పెట్టుకుని, వంటవాడిని హతమార్చారు. ఈ ఘటన రాజస్తాన్ లో జరిగింది. హతుడు తెలంగాణకు చెందిన శివ దేశ్ ముఖ్.

ట్రెండింగ్ వార్తలు
తెలంగాణకు చెందిన వ్యక్తి..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన శివ దేశ్ ముఖ్ రాజస్తాన్ లోని జైసల్మేర్ జిల్లాలో ఉన్న రామ్ గఢ్ లో హైవే పై ఉన్న ఒక రెస్టారెంట్ లో షెష్ గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి నలుగురు వ్యక్తులు ఆ రెస్టారెంట్ కు వచ్చారు. భోజనం ఆర్డర్ చేశారు. తమకు సర్వ్ చేసిన ఐటమ్స్ రుచికరంగా లేవని, నాణ్యత లేదని హోటల్ యజమానితో, వంటవాడైన శివ దేశ్ ముఖ్ తో గొడవ పెట్టుకున్నారు. గొడవ క్రమంక్రమంగా పెద్దదైంది. ఈ క్రమంలో షెఫ్ శివ దేశ్ ముఖ్ పై ఆ నలుగురు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. దాంతో, శివ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆ నలుగురు దుండగులు పారిపోయారు. హోటల్ ఇతర సిబ్బంది, యజమాని కలిసి శివ దేశ్ ముఖ్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ దేశ్ ముఖ్ మరణించాడు.
కేసు నమోదు..
అనంతరం, రెస్టారెంట్ యజమాని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివ దేశ్ ముఖ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు శివ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతడి కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత పోస్ట్ మార్టం కు పంపిస్తామని పోలీసులు తెలిపారు. హత్యా నేరం కింద కేసు నమోదు చేసుకున్నామని, నిందితులు నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.