How to recognize fake Aadhaar: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు అంచుల ఖడ్గంగా మారింది. ఏఐ తో సానుకూలతతో పాటు అదే స్థాయిలో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. తాజాగా, భారత ప్రభుత్వం మాత్రమే జారీ చేయాల్సిన ఆధార్ కార్డును ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో చాట్ జీపీటీలో సులభంగా సృష్టిస్తున్నారు. దీనివల్ల అనేక సమస్యలు, భద్రతాముప్పులు వచ్చే ప్రమాదముంది.
పిల్లలు, శిశువులతో సహా ప్రతి భారతీయ వ్యక్తికి ఆధార్ కార్డు ను భారత ప్రభుత్వం తప్పని సరి చేసింది. ఆధార్ అనేది 12 అంకెల ప్రత్యేక గుర్తింపు. ఇది "డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ సమాచారం ఆధారంగా ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేకతను నిర్ధారిస్తుంది" అని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి ఒక్కరికీ ఒకే యూనిక్ ఆధార్ ఐడీ నెంబర్ ఇస్తారు. చాలా ప్రభుత్వ సేవలు పొందడానికి ఆధార్ ను తప్పని సరి చేశారు. ఇప్పుడు ఏఐతో నకిలీ ఆధార్ సృష్టింవచ్చన్న వార్తల నేపథ్యంలో, ఒరిజినల్, ఫేక్ ఆధార్ లను గుర్తించడానికి ఈ టిప్స్ ఉపయోగపడ్తాయి.
ఒరిజినల్ ఆధార్, ఫేక్ ఆధార్ ల వ్యత్యాసాన్ని గుర్తించడానికి క్రింది చిత్రాలను తనిఖీ చేయండి. ఎడమవైపున ఉన్న చిత్రం చాట్ జిపిటిని ఉపయోగించి సృష్టించారు. కుడి వైపున ఉన్న రెండు చిత్రాలు నిజమైన ఆధార్ కార్డు చిత్రాలు.
వ్యత్యాసం 1: ఐడిలోని పాస్ పోర్ట్-సైజ్ ఇమేజ్ ను నిశితంగా పరిశీలిస్తే, ఏఐతో జనరేట్ చేసిన ఇమేజ్ లను గుర్తించవచ్చు. అవి అసలైన ఇమేజ్ నుంచి సోర్స్ చేసినవిగా కూడా ఉండవచ్చు.
వ్యత్యాసం 2: అసలైన మరియు నకిలీ ఆధార్ కార్డులపై తెలుగు / ఇంగ్లీష్ ఫాంట్ లను పోల్చండి.
వ్యత్యాసం 3: కోలన్, స్లాష్, కామా ల స్థానంతో సహా రెండు ఆధార్ లలోని వాక్యనిర్మాణాన్ని చెక్ చేయండి.
వ్యత్యాసం 4: ఆధార్ లోగోను, భారత ప్రభుత్వ లోగోను జాగ్రత్తగా చెక్ చేయండి.
వ్యత్యాసం 5: ఆధార్ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉందో లేదో చూడండి. అది ఉంటే, అది నిజమైనదా? కాదా? అని తెలుసుకోవడానికి దానిని స్కాన్ చేయండి. ఒరిజినల్ ఆధార్ లోని క్యూఆర్ ను స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఆ ఆధార్ పొందిన వ్యక్తి వివరాలు కనిపిస్తాయి.
యుఐడిఎఐ వెబ్ సైట్ లో ఆధార్ ను ఎలా వెరిఫై చేయాలో స్టెప్ బై స్టెప్ ను ఇక్కడ చూడండి.
మీ ఆధార్ ను సురక్షితంగా ఉంచుకోవడం కోసం వర్చువల్ ఐడి (విఐడి) మరో మంచి మార్గం. వర్చువల్ ఐడీ (VID) అనేది మీ ఆధార్ నంబర్తో మ్యాప్ చేయబడిన తాత్కాలిక 16-అంకెల ర్యాండమ్ నంబర్. అథెంటికేషన్ లేదా ఈ-కేవైసీ సేవలు నిర్వహించినప్పుడల్లా ఆధార్ నంబర్ కు బదులుగా వీఐడీలను ఉపయోగించుకోవచ్చు. ఆధార్ నంబరును ఉపయోగించిన విధంగానే విఐడిని ఉపయోగించి ధృవీకరణ చేయవచ్చు. వీఐడీ నుంచి ఆధార్ నంబర్ పొందడం సాధ్యం కాదు.
ఆధార్ నంబర్ హోల్డర్ తరఫున ఏయూఏ/కేయూఏ వంటి మరే ఇతర సంస్థ కూడా వీఐడీని జనరేట్ చేయదని ప్రభుత్వం చెబుతోంది. ఆధార్ నంబర్ హోల్డర్ స్వయంగా మాత్రమే వీఐడీని జనరేట్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ హోల్డర్ తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ ద్వారా కోడ్ ను అందుకుంటారు.
సంబంధిత కథనం
టాపిక్