Chandrayaan-3 latest news : చంద్రయాన్-3 మిషన్‌పై మరో కీలక అప్డేట్ ఇచ్చింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. గత నెల 23 నుంచి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రగ్యాన్ రోవర్.. తన పనిని విజయవంతంగా పూర్తి చేసిందని స్పష్టం చేసింది. తాజాగా.. ఈ రోవర్‌ను స్లీప్ మోడల్లో పెట్టినట్టు వెల్లడించింది.
చంద్రుడి సౌత్ పోల్‌లో సూర్య రశ్మి తగ్గుముఖం పడుతోంది. మరో 14 రోజుల పాటు అక్కడ వెలుతురు ఉండదు. అందుకే రోవర్‌ను స్లీప్ మోడ్‌లో పెట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.
Pragyan rover news : "ప్రగ్యాన్ రోవర్.. తన అసైన్మెంట్ను పూర్తి చేసుకుంది. దానిని సేఫ్‌గా పార్క్ చేశాము. స్లీప్ మోడ్‌లో పెట్టాము. రోవర్‌లోని పేలోడ్స్‌ని కూడా ఆఫ్ చేశాము. ఇప్పటివరకు రోవర్ సేకరించిన డేటా మొత్తాన్ని విక్రమ్ ల్యాండర్ సాయంతో భూమికి ట్రాన్స్‌మీట్ చేశాము," అని ఇస్రో స్పష్టం చేసింది.
ఆగస్ట్ 23 నుంచి 14 రోజుల పాటు పనిచేసే విధంగా ప్రగ్యాన్ రోవర్‌ను రూపొందించింది ఇస్రో.
"ప్రస్తుతం రోవర్ బ్యాటరీ ఫుల్‌గా ఉంది. 2023 సెప్టెంబర్ 22 నుంచి మళ్లీ అక్కడ సూర్యుడి ఖాంతి పడొచ్చు. ఆ తర్వాత రోవర్‌ను యాక్టివేట్ చేసి, మరిన్ని అసైన్మెంట్స్ చేపట్టాలని ఆశిస్తున్నాము," అని ఇస్రో స్పష్టం చేసింది.
Pragyan rover latest news : అయితే.. చంద్రుడిలో రాత్రి అయినప్పుడు, అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ 120 డిగ్రీలకు కూడా చేరే అవకాశం ఉంటుంది. దీనిని తట్టుకునే శక్తి చంద్రయాన్-3లోని ఎలక్ట్రానిక్ పరికరాలకు లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య ఖాంతి మళ్లీ తాకేసరికి.. రోవర్ యాక్టివేట్ అవుతుందా? లేదా? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.
అయితే రోవర్ పంపించిన డేటాలో నీటి జాడ ఉందా? లేదా? అన్న విషయంపై ఇస్రో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై సంచలన ప్రకటన చేస్తే.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ సంచలనం సృష్టించినట్టే. అయితే.. సల్ఫర్‌తో పాటు ఇతర ఖనిజాలను రోవర్ కనుగొందని కొన్ని రోజుల క్రితమే వెల్లడించింది ఇస్రో. అల్యుమీనియం, ఐరన్, కాల్షియం, క్రోమియం, టిటానియం, మాంగనీస్, ఆక్సీజన్, సిలికాన్ వంటివి చంద్రుడి ఉపరితలంపై రోవర్ డిటెక్ట్ చేసిందని పేర్కొంది.
Aditya L1 launch : చంద్రయాన్-3 తర్వాత.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 లాంచ్ సక్సెస్ అయ్యింది. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు.. ఆదిత్య ఎల్1ను మోసుకెళుతూ నింగిలోకి ఎగిరింది పీఎస్ఎల్వీ రాకెట్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం