Chandrayaan-3: చంద్రయాన్ 3 ల్యాండర్ సెల్ఫీ వీడియో.. సగర్వంగా షేర్ చేసిన ఇస్రో
Chandrayaan-3: చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అయిన విక్రం ల్యాండర్ లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన వీడియోను ఇస్రో లేటెస్ట్ గా షేర్ చేసింది.
Chandrayaan-3: చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అయిన విక్రం ల్యాండర్ లో నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన వీడియోను ఇస్రో లేటెస్ట్ గా షేర్ చేసింది. ల్యాండర్ లోని హై రెజొల్యూషన్ కెమెరా తీసిన ఈ వీడియోను ఇస్రో షేర్ చేసింది. ఈ వీడియోలో ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ ర్యాంప్ మీదుగా నెమ్మదిగా జారుతూ కిందకు, జాబిల్లి ఉపరితలంపైకి దిగడాన్ని గమనించవచ్చు. ఈ రోవర్ పై భారత జాతీయ జెండా, జాతీయ చిహ్నాలను కూడా పొందుపర్చారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
ట్విటర్లో..
చందమామపై ప్రజ్ఞాన్ రోవర్ తొలి అడుగులను ల్యాండర్ లోని కెమెరా కాప్చర్ చేసిన సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ.. చంద్రయాన్ 3 రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలం మీదకు ర్యాంప్ మీదుగా దిగుతోంది’ అని ఇస్రో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ తన విధులను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది.
41 రోజుల ప్రయాణం..
జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించింది. చంద్రయాన్ 3 అంతరిక్షంలో 41 రోజులపాటు ప్రయాణించి ఆగస్టు 23న దిగ్విజయంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు దక్షిణ ధ్రువం పై ఏ దేశం కూడా ల్యాండర్ ను ల్యాండ్ చేయలేదు.