Chandrayaan-3: చందమామపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ సాగేదిలా..-chandrayaan3 isro set to initiate automatic landing sequence ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3: చందమామపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ సాగేదిలా..

Chandrayaan-3: చందమామపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియ సాగేదిలా..

HT Telugu Desk HT Telugu

Chandrayaan-3: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇస్రో బుధవారం ప్రకటించింది. ల్యాండర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది.

చంద్రయాన్ 3 తీసిన చంద్రుడి ఉపరితలం ఫొటో (ISRO twitter)

Chandrayaan-3: చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండర్ సేఫ్ గా ల్యాండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇస్రో బుధవారం ప్రకటించింది. ల్యాండర్ ను సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది.

ల్యాండింగ్ సీక్వెన్స్ ఇలా..

ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం ల్యాండింగ్ ప్రక్రియ ఇలా ఉండబోతోంది..

  • ప్రస్తుతం చంద్రుడిపై 30 కిమీల ఎత్తులో చంద్రయాన్ 3 ల్యాండర్ ప్రయాణిస్తోంది.
  • బుధవారం సాయంత్రం 5.44 గంటల సమయంలో కక్ష్యలోని నిర్ధారిత ప్రదేశానికి ల్యాండర్ మోడ్యూల్ చేరుకోగానే ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్ (ALS) ను ప్రారంభిస్తారు. ఆ మేరకు
  • ALS కమాండ్స్ ను అందుకోగానే, ల్యాండర్ లోని నాలుగు ఇంజన్లు యాక్టివేట్ అవుతాయి. ఈ ఇంజన్లు రెట్రో ఫైరింగ్ ద్వారా ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తాయి. దీన్ని పవర్డ్ బ్రేకింగ్ ఫేజ్ గా పిలుస్తారు.
  • ఇదే సమయంలో చంద్రుడికి సమాంతరంగా ప్రయాణిస్తున్న ల్యాండర్ మోడ్యూల్ చంద్రుడిపై నిట్ట నిలువుగా దిగడానికి వీలుగా దిశను మార్చుకుంటుంది.
  • 30 కిమీ ల ఎత్తు నుంచి 6.8 కిమీల ఎత్తులోకి చేరుకోగానే, నాలుగు ఇంజన్లలో రెండింటిని ఆపేస్తారు.
  • చంద్రుడి కి 150 నుంచి 100 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ల్యాండర్ మోడ్యూల్ లోని సెన్సర్స్, కెమెరాలు యాక్టివేట్ అవుతాయి. సేఫ్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశాన్ని గుర్తించే పని ప్రారంభిస్తాయి.
  • ల్యాండింగ్ కు అనువైన ప్రదేశాన్ని గుర్తించగానే, వేగాన్ని పూర్తిగా నియంత్రించుకుని నెమ్మదిగా చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఇది అత్యంత క్లిష్టమైన దశ.
  • విజయవంతంగా ల్యాండ్ అయిన తరువాత, అక్కడి ఉపరితలంపై పరుచుకున్న దుమ్ము, దూళి సెటిల్ అయిన తరువాత, ల్యాండర్ సైడ్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ర్యాంప్ ద్వారా రోవర్ చంద్రుడిపై ప్రయాణం ప్రారంభిస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.