Student raped : 12వ తరగతి విద్యార్థినిపై బస్​ డ్రైవర్​ అత్యాచారం- ఫొటోలు మార్ఫ్​ చేసి..-chandigarh class 12 student raped by school bus driver ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Student Raped : 12వ తరగతి విద్యార్థినిపై బస్​ డ్రైవర్​ అత్యాచారం- ఫొటోలు మార్ఫ్​ చేసి..

Student raped : 12వ తరగతి విద్యార్థినిపై బస్​ డ్రైవర్​ అత్యాచారం- ఫొటోలు మార్ఫ్​ చేసి..

Sharath Chitturi HT Telugu
Aug 23, 2024 05:49 AM IST

Student raped in Chandigarh : చండీగఢ్​కు చెందిన 26 ఏళ్ల యువకుడు 17 ఏళ్ల బాలిక ఫొటోలను మార్ఫింగ్ చేశాడు. అనంతరం అవి చూపించి, ఆమెను బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన స్కూల్​ బస్​ డ్రైవర్​
బాలికపై అత్యాచారానికి పాల్పడిన స్కూల్​ బస్​ డ్రైవర్​

చండీగఢ్​లోని ఓ ప్రముఖ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన బస్సు డ్రైవర్​ను జిరాక్​పూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

మార్ఫింగ్ చిత్రాలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన నిందితుడు చండీగఢ్​లోని మణిమజ్రాకు చెందిన మహ్మద్ రజాక్ (26). మే, జులై నెలల్లో మూడుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

తీవ్ర మనోవేదనకు గురైన మైనర్ బాలిక చివరకు తన బాధను తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం బయటపడింది. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన జిరాక్​పూర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 506 (క్రిమినల్ బెదిరింపు), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

వెంబడించి.. వెంబడించి..

తన పాఠశాలలో బస్సు డ్రైవర్​గా ఉన్న నిందితుడు రజాక్ కొన్ని నెలలుగా తనను వెంబడిస్తున్నాడని, స్నేహం కోసం కూడా తనను సంప్రదించాడని మైనర్ బాలిక పోలీసులకు తెలిపింది. ఆమె నిరాకరించడంతో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి తన ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరించాడని వివరించింది.

మే 18న తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఆమె, ఆమె సోదరి ఇంట్లో ఉన్నారు. ఈలోగా రజాక్ ఆమె ఇంటికి వెళ్లి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని, అందుకు ఒప్పుకోకపోతే అభ్యంతరకర చిత్రాలను ఆన్​లైన్​లో పోస్ట్​ చేస్తానని బెదిరించాడు.

ఆమెను బెదిరించి జులై 6, 26 తేదీల్లో రెండుసార్లు ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం అతని​ దృష్టికి తీసుకెళ్లడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆ స్కూల్ డ్రైవర్ రాజీనామా సమర్పించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. యూటీ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్న చైల్డ్​లైన్​ హెల్ప్​లైన్​కి కూడా ఈ నేరం గురించి సమాచారం అందించారు.

పాఠశాల విద్యాశాఖకు సమాచారం అందించిందని, ఆ తర్వాత ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని యూటి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ హర్సుహిందర్ పాల్ సింగ్ బ్రార్ తెలిపారు.

ఎనిమిదేళ్ల బాలుడిపై లైంగిక దాడి..!

ఎనిమిదేళ్ల బాలుడిపై 35 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మొహాలీలో చేటుచేసుకుంది.

మొహాలీకి చెందిన గురుదీప్ సింగ్ అనే వ్యక్తి.. బాలుడిని బూత్​గఢ్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

రక్తస్రావం కావడంతో తన కుమారుడు తనకు సమాచారం అందించాడని, ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బుధవారం నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు గురువారం స్థానిక కోర్టులో హాజరుపర్చగా రెండు రోజుల పోలీసు కస్టడీ విధించారు.

అతనిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 137 (2), 351 (3) కింద, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద మజ్రీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ 23ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన జిరాక్​పూర్ వాసి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుడు క్లినిక్​లో పనిచేస్తూ బాధితురాలి ఇంటికి సమీపంలో అద్దెకి నివాసముంటున్నాడు. బాధితురాలు ఇరుగుపొరుగు ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేస్తోంది.

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిందితుడు తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలుసుకున్న తరువాత, ఆమె వివాహం కోసం అతనిని సంప్రదించింది, కాని అతను తన హామీ వెనక్కి తగ్గాడు. అప్పటి నుంచి అన్ని సంబంధాలను కట్​ చేసుకున్నాడు. అతని మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో లేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

నిందితుడిపై జిరాక్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 376(2) (ఎన్) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

బంధువుపై అత్యాచారం..

జిరాక్ పూర్​లో మరో లైంగిక హింస ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన ఓ వ్యక్తి తన బంధువుపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

23 ఏళ్ల బాధితురాలు తన బంధువు రెండేళ్లుగా లూథియానాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నట్లు పోలీసులకు తెలిపింది. ఆమెను జిరాక్​పూర్​లోని చాట్ గ్రామానికి తీసుకువచ్చి జూ సమీపంలోని పొదల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లయిన తర్వాత ఈ విషయాన్ని భర్తకు చెప్పడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జిరాక్​పూర్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత కథనం