తప్పుడు వార్త (fake news)లను ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆరు యూట్యూబ్ చానెళ్ల (YouTube channels)పై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. విద్వేష సమాచారాన్ని, తప్పుడు వార్తలను, దేశ ద్రోహ సమాచారాన్ని ప్రసారం చేస్తున్న, ప్రోత్సహిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.,Centre cracks down on 6 YouTube channels: ఆరు చానెళ్లపై వేటుతాజాగా, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న ఆరు యూట్యూబ్ చానెళ్ల (YouTube channels)పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ ఆరు చానెళ్ల ప్రసారాలను నిషేధించింది. ఆ ఆరు యూట్యూబ్ చానెళ్లకు (YouTube channels) కలిపి మొత్తంగా 20 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఆరు చానెళ్లు (YouTube channels) సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా, కుట్రపూరితంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)కు చెందిన ఫ్యాక్ట్ చెక్ (Fact Check) విభాగం వెల్లడించింది. ఈ ఆరు చానెళ్లు (YouTube channels) ప్రసారం చేసిన వీడియోలను సుమారు 51 కోట్ల మంది వీక్షించారని తెలిపింది.,Centre cracks down on 6 YouTube channels: ఇవే ఆ చానెళ్లు..ఎన్నికలు, ఎన్నికల నిర్వహణ, ఫలితాలు, సుప్రీంకోర్టు కార్యకలాపాలు, పార్లమెంటు కార్యకలాపాలు,ప్రభుత్వ నిర్ణయాలు.. మొదలైన సున్నితమైన అంశాలపై తప్పుడు వార్తలను, వీడియోలను ప్రసారం చేస్తున్న నేషన్ టీవీ(Nation TV), సంవాద్ టీవీ (Samvaad TV), సరోకర్ భారత్ (Sarokar Bharat), నేషన్ 24 (Nation24), స్వర్ణిమ్ భారత్ (Swarnim Bharat), సంవాద్ సమాచార్ (Samvaad Samachaar) లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. వీటిలో Nation TV కి 5.57 లక్షల సబ్ స్క్రైబర్లు, Samvaad TV 10.9 లక్షల సబ్ స్క్రైబర్లు Sarokar Bharat కు 21,100 మంది సబ్ స్క్రైబర్లు, Nation24 చానెల్ కు 25400 సబ్ స్క్రైబర్లు ,Swarnim Bharat యూట్యూబ్ చానెల్ కు 6,070 మంది సబ్ స్క్రైబర్లు, Samvaad Samachaar చానెల్ కు 3.48 లక్షల సబ్ స్క్రైబర్లు ఉన్నారని వెల్లడించింది.