14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎంఎస్పీ తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం కనీస మద్ధతు ధరపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, 14 పంటలకు కనీస మద్ధతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
‘‘వరి ధాన్యానికి కనీస మద్ధతు ధరను క్వింటాల్ కు రూ .2,300 గా నిర్ణయించారు. ఇది మునుపటి ఎంఎస్పీ కంటే రూ .117 ఎక్కువ’’ పెరిగింది" అని వైష్ణవ్ చెప్పారు. 14 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు సుమారు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని వైష్ణవ్ తెలిపారు. గత సీజన్ కంటే ఇది రూ.35,000 కోట్లు ఎక్కువని చెప్పారు.