Central Sector scheme of scholarship: కళాశాల విద్యార్థులకు సీఎస్ఎస్ స్కాలర్‌షిప్-central sector scheme of scholarship for college university students from higher education department ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Central Sector Scheme Of Scholarship For College University Students From Higher Education Department

Central Sector scheme of scholarship: కళాశాల విద్యార్థులకు సీఎస్ఎస్ స్కాలర్‌షిప్

HT Telugu Desk HT Telugu
Sep 05, 2022 05:04 PM IST

Central Sector scheme of scholarship: కళాశాల, యూనివర్శిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్స్ కోసం దరఖాస్తుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.

కళాశాల, యూనివర్శిటీ విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
కళాశాల, యూనివర్శిటీ విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Central Sector scheme of scholarship: నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఆసక్తి గల అభ్యర్థులు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. కళాశాల విద్యార్థులు, యూనివర్శిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబరు 31గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

సీబీఎస్ఈ ఈమేరకు సోమవారం ఒక ప్రకటన వెలువరించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. 2021, 2020, 2019, 2018 విద్యాసంవత్సరంలో స్కాలర్‌షిప్ పొందిన వారు రెండో సంవత్సరానికి, మూడో సంవత్సరానికి, నాలుగో సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపింది. విద్యార్థులు ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్‌షిప్స్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపింది.

ఈ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్‌ను కేంద్ర ఉన్నత విద్యా విభాగం మంజూరు చేస్తోంది.

‘విద్యార్థులంతా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ధిష్ట గడువు తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలి. సంబంధిత విద్యా సంస్థల ద్వారా దరఖాస్తులను ధ్రువీకరించుకోవాలి. అవసరమైనప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇనిస్టిట్యూట్‌కు చూపించాలి. లేదంటే దరఖాస్తు అనర్హతకు గురవుతుంది..’ అని ఒక ప్రకటనలో తెలిపింది.

IPL_Entry_Point

టాపిక్