Anti tobacco warnings on OTTs: ఇక ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు-central government makes mandatory for ott platforms to display anti tobacco warnings ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Central Government Makes Mandatory For Ott Platforms To Display Anti Tobacco Warnings

Anti tobacco warnings on OTTs: ఇక ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు: కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

Chatakonda Krishna Prakash HT Telugu
May 31, 2023 01:07 PM IST

Anti tobacco warnings on OTT Platforms: పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ఇకపై ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు కూడా ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

Anti tobacco warnings on OTTs: ఇక ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు (HT Photo)
Anti tobacco warnings on OTTs: ఇక ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు (HT Photo)

Anti tobacco warnings on OTT Platforms: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు కూడా ఇక నుంచి తప్పనిసరిగా పొగాకు వ్యతిరేక హెచ్చరికలు ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీల్లోని కంటెంట్‍లో సిగరెట్లు, టొబాకో వ్యతిరేక యాడ్స్, హెచ్చరిక స్పాట్స్ ఇవ్వాలని కేంద్ర వైద్య శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సిగరెట్స్, టొబాకో ఉత్పత్తుల నియంత్రణ చట్టం 2004కు సవరణలు చేసింది. సినిమా థియేటర్లు, టీవీ ప్రోగ్రామ్‍ల్లో ప్రదర్శిస్తున్న యాంటీ-టొబాకో హెచ్చరికలను ఇక ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోనూ ప్రసారం చేయాలని ఆదేశించింది. బుధవారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో థియేటర్లు, టీవీ ఛానెళ్లలోలా ఇక అమెజాన్ ప్రైమ్, నెట్‍ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‍స్టార్‌తో పాటు అన్ని ఓటీటీల్లోనూ త్వరలోనే పొగాకు వ్యతిరేక యాడ్స్, హెచ్చరికలు కనిపించనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

ఆన్‍లైన్ క్యురేటెడ్ కంటెంట్ (ఓటీటీ కంటెంట్)లోనూ ఇక నుంచి తప్పనిసరిగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా హెచ్చరికలు ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆన్‍లైన్ ప్లాట్‍ఫామ్‍ల్లో ప్రోగ్రామ్ (సినిమా, సిరీస్ సహా మిగతా కంటెంట్)ల ప్రారంభంతో పాటు మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు వ్యతిరేక యాడ్స్ ప్రదర్శించాలని పేర్కొంది. అలాగే, ఏదైనా సీన్లలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను వాడుతున్నట్టు కనిపిస్తే అంతసేపు.. స్క్రీన్‍పై యాంటీ-టొబాకో హెల్త్ వార్నింగ్‍ను ఓ మూలన స్థిరంగా చూపించాలని పేర్కొంది.

కంటెంట్ ఉన్న భాషలోనే ఈ పొగాకు వ్యతిరేక సందేశాలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించకపోతే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లపై కేంద్ర ప్రసార శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు సినిమా థియేటర్లు, టీవీల్లో కనిపిస్తున్న ఈ పొగాకు వ్యతిరేక యాడ్స్ ఇక ఓటీటీల్లోకి కూడా రానున్నాయి.

సిగరెట్లతో పాటు ఇతర పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాలు, దుష్ఫలితాలపై ప్రజలకు అహగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఇక ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాలనే నిబంధన తీసుకొచ్చింది.

కాగా, నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం జరుగుతోంది. ప్రతీ సంవత్సరం మే 31న ఈ దినాన్ని డబ్ల్యూహెచ్‍వో నిర్వహిస్తుంది. పొగాకు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు దీన్ని డబ్ల్యూహెచ్‍వో చేస్తోంది. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని మానేసేందుకు ప్రోత్సహిస్తుంది.

WhatsApp channel