Chinese Apps Ban: దేశంలో 232 యాప్స్ బ్యాన్: వివరాలివే..
Chinese Apps Ban: చైనీస్ యాప్‍లపై మరోసారి ప్రభుత్వం వేటు వేసింది. 138 బెట్టింగ్ యాప్‍లు, 94 లోన్ యాప్‍ల బ్యాన్ ప్రక్రియను మొదలుపెట్టింది.
Chinese Apps Ban: చైనీస్ లింక్‍లు ఉన్న యాప్‍లపై భారత ప్రభుత్వం (Government on India) మరోసారి కొరడా ఝళిపించింది. 138 బెట్టింగ్ యాప్‍లు (Betting Apps), 94 రుణ యాప్‍ల (Loan Apps)ను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ 232 చైనా యాప్‍ల బ్యాన్ ప్రక్రియను ప్రారంభించింది. అత్యవసరంగా ఈ మొబైల్ యాప్‍లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరావిలే..
కారణమిదే..
Chinese Apps Ban: హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనతో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ యాప్‍ల బ్యాన్ ప్రాసెస్‍ను ప్రారంభించింది. 288 చైనీస్ యాప్‍లపై సుమారు ఆరు నెలలుగా ప్రభుత్వం విశ్లేషణ చేస్తోందని రిపోర్టుల ద్వారా బయటికి వచ్చింది. ఆ యాప్స్ భారత పౌరుల వ్యక్తిగత డేటాను సేకరిస్తోందని దీంట్లో తేలింది. దీంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. ఐటీ యాక్ట్ 69 కింద 232 యాప్‍లను బ్యాన్ చేసేందుకు నిర్ణయించింది. దేశ సమగ్రత, సార్యభౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాయని ఆ యాప్‍లను నిషేధించింది.
రుణ యాప్‍ల వేధింపుల ఫిర్యాదులతో..
Chinese Apps Ban: లోన్ యాప్‍ల ద్వారా రుణం తీసుకున్న వారిని.. ఆ యాప్‍లు నడిపే వారు వేధిస్తున్న ఘటనలు ఇటీవల చాలా వెలుగులోకి వచ్చాయి. అప్పు చెల్లించడంలో కాస్త ఆలస్యమైనా, కొన్ని సందర్భాల్లో తీర్చినా ఇంకా ఇవ్వాలంటూ చాలా మందిని వివిధ రకాలుగా లోన్ యాప్ నిర్వాహకులు వేధించిన విషయాలు బయటికి వచ్చాయి. అయితే, చైనా జాతీయులు కొందరు భారతీయులను ఉద్యోగులుగా నియమించుకొని ఈ రుణ యాప్‍లను నిర్వహిస్తున్నారని ఇటీవల ఓ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఆ యాప్‍ల ద్వారా రుణం తీసుకుంటున్న ప్రజలు కొందరు భారీ వడ్డీ కడుతున్నారని తేలింది.
Chinese Apps Ban: చెల్లింపులు కాస్త ఆలస్యమైనా లోన్ యాప్‍లు నిర్వహించే వారు.. రుణం తీసుకున్న తీవ్రంగా వేధిస్తారు. అసభ్యకరమైన మెసేజ్‍లు, మార్ఫింగ్ ఫొటోలను వారి కాంటాక్టులకు సెండ్ చేసి వేధిస్తారు. ఇలాంటి ఘటనలతో తీవ్ర ఆవేదన చెందిన కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. దీంతో లోన్ యాప్‍లను నిషేధించాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి.
Chinese Apps Ban: అధికారిక ప్లే స్టోర్లలో తొలగించినా.. బెట్టింగ్, లోన్ యాప్‍లను ఇండిపెండెంట్ లింక్‍లు, వెబ్‍సైట్ల ద్వారా కొందరు డౌన్‍లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారని తేలింది. దీంతో వీటిని పూర్తిగా నిషేధించాలని, యాక్సెస్ బ్లాక్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
మూడేళ్ల నుంచి..
Chinese Apps Ban: 2020 నుంచి చైనాకు చెందిన వందలాది యాప్‍లను భారత ప్రభుత్వం నిషేధించింది. భారతీయుల డేటాను చైనీస్ యాప్‍లు సేకరిస్తున్నాయని, దేశ సమగ్రతకు, భద్రతకు ముప్పుగా ఉన్నాయని వాటిని బ్యాన్ చేసింది. టిక్‍టాక్, పబ్‍జీ మొబైల్, క్యామ్ స్కానర్‌తో పాటు వందలాది యాప్‍లను నిషేధించింది.
సంబంధిత కథనం